Manchu Lakshmi: I Had To Sell Kidney To Buy Flight Ticket - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి

Published Mon, Dec 27 2021 7:41 AM | Last Updated on Mon, Dec 27 2021 9:06 AM

Manchu Lakshmi: I Had To Sell Kidney To Buy Flight Ticket - Sakshi

మంచు లక్ష్మి.. అటు సినిమాలతో పాటు అడపాదడపా షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యే కలరి విద్య కూడా నేర్చుకుంటోంది మంచువారమ్మాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఫ్యామిలీతో ఉన్నాను.. ఇక నాకోసం కొంత సమయం కేటాయించుకోవడానికి వెళ్తున్నాను అని ట్వీట్‌ చేసింది. అంటే ఒంటరిగా మంచు లక్ష్మి ఫారిన్‌ ట్రిప్‌ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

'ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్‌ కొనేందుకు నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్‌ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా' అంటూ ట్వీట్‌ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'మంచక్క, నువ్వు కూడా మా బ్యాచేనా' అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం 'మీరు రిచ్‌ కదా.. మీరు కూడా ఇలా చేస్తారా?' అని అడిగారు. దీనికి లక్ష్మి స్పందిస్తూ 'మా నాన్న రిచ్‌ తమ్ముడు, నేను కాదు' అంటూ కౌంటర్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement