టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎమ్.ఎమ్.పులి అని పిలుస్తామని కూడా ఆమె తెలిపింది.
తాజాగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. తమ గారాల ముద్దు బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకునిపోతున్న సందర్భంలో హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడిగా ఉన్న ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment