
నిజం అని నమ్మి..!
ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, దొంగాట’ వంటి చిత్రాల్లో నటించి, నిర్మాతగానూ వ్యవహరించారు లక్ష్మీ మంచు.
ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, దొంగాట’ వంటి చిత్రాల్లో నటించి, నిర్మాతగానూ వ్యవహరించారు లక్ష్మీ మంచు. తాజాగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆమె ప్రధానపాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా విజయ్ యలంకంటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. హీరో మంచు మనోజ్, ఆయన భార్య ప్రణతి, మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ స్క్రిప్ట్‌ని లక్ష్మీ, విజయ్‌లకు అందించారు.
మంచు లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘నిజం కాని విషయాన్ని నిజమని భావించే ఓ యువతి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్ చుట్టూనే కథంతా తిరుగుతుంది. ‘ఈగ, బాహుబలి–1’ సినిమాలకు రాజమౌళి గారి దగ్గర విజయ్ అసిస్టెంట్ డైరక్టర్‌గా చేశాడు. ఈ సినిమా కాకుండా ఓ వెబ్ సిరీస్‌ను కూడా మొదలుపెట్టబోతున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సుహాసిని, లత.