సరికొత్త ‘రైటర్’
సరికొత్త ‘రైటర్’
Published Thu, Oct 17 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
‘‘దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి బాలు. తనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. తను రూపొందించిన ఈ చిత్రం సరికొత్త రీతిలో ఉంటుంది’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. సూర్య, దీపు, శ్రుతి ముఖ్య తారలుగా యం. బాలు దర్శకత్వంలో అరుణ, బాలు నిర్మించిన చిత్రం ‘రైటర్’. రుంకీ గోస్వామి స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
మంచు లక్ష్మీప్రసన్న లోగోను, సీడీని ఆవిష్కరించారు. బాలు చాలా ప్రతిభావంతుడని, సినిమా బాగా తీసి ఉంటాడని నమ్ముతున్నానని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ప్రతి రైటర్‌లోనూ మంచి ఫైటర్ ఉంటాడని, ఈ టైటిల్, పాటలు బాగున్నాయని మరుధూరి రాజా చెప్పారు.
మా నాన్నగారి చిత్రాలకు బాలు పని చేశారని, ఆయన చేతుల మీదగా పెరిగిన నేను ఈ లోగోను, సీడీని విడుదల చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీప్రసన్న అన్నారు. రచయిత కావాలనే తపనతో సినిమా పరిశ్రమకు వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని సూర్య చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పసుపులేటి లక్ష్మీనారాయణ.
Advertisement
Advertisement