నటి మంచు లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్‌లో ఆమె చోటు దక్కించుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ సినీ ఉమెన్ జాబితాను విడుదల చేస్తుంది. అయితే ఈ ఏడాదికిగాను ఈ జాబితాలో మంచు లక్ష్మి స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా తనను నామినేట్ చేసిన కండ్లెర్ మ్యాగజైన్‌కు ధన్యవాదాలు తెలిపింది. కాగా టీసీ కండ్లెర్ అనే సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ సినిమా, టీవీ, పాప్ ఆర్టిస్ట్‌లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తోంది.
చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదికిగాను తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి మంచు లక్ష్మి ఎన్నికవ్వడం విశేషం. ఇకపోతే విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి చిత్రపరిశ్రమలో నటిగా, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రెటీ సింగర్‌గా, నటిగా ఆమె పలు అవార్డులను కూడా అందుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, వ్యాయమం వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హల్‌చల్ చేస్తూ ఉంటుందీ మంచు లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment