
సాక్షి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలు చేసే నటి మంచు లక్ష్మిని మరోనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి లక్ష్మి చాలా కృషి చేస్తున్నారని రేణు కొనియాడారు. ఆమెతో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌లో రేణు ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షోలో రేణు పాల్గొన్నారు. ఎలాంటి నగదు తీసుకోకుండా అవసరాల్లో ఉన్న వారి కోసం పనిచేయడం తృప్తి నిచ్చిందన్నారు.
‘బొమ్మలు అమ్మి 30 వేల రూపాయాలు సంపాదించా. వాటికి మరో 20 వేల రూపాయలు కలిపి ఇచ్చాను. ఆ నగదుకు మంచు లక్ష్మి మరో లక్ష రూపాయలు జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షల రూపాయలు లక్ష్మి విరాళంగా ఇచ్చేశారు. అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయమంటూ’ నటి రేణూ తన పోస్టులో పేర్కొన్నారు. హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ హ్యుమన్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో రేణు చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment