కడుపుబ్బా నవ్వించేలా.....! | Appudala Ippudila Theatrical Trailer featuring | Sakshi
Sakshi News home page

కడుపుబ్బా నవ్వించేలా.....!

Published Mon, Apr 6 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

కడుపుబ్బా నవ్వించేలా.....!

కడుపుబ్బా నవ్వించేలా.....!

 ప్రతి క్షణం ప్రేక్షకులను కడుపుబ్బా న వ్వించేలా, కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. సూర్యతేజ, హర్షిక జంటగా జంపా క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్‌కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఆర్ విష్ణు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీ మంచు ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ- ‘‘మొదటి సినిమా చేసేటప్పుడు ఎంత టెన్షన్‌గా ఉంటుందో నాకు తెలుసు.
 
 ఈ చిత్రం ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. ఓ మంచి సినిమా తీస్తున్న చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’’ అని చెప్పారు. ఈ సినిమాలో నరేశ్‌గారు ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం చాలా ఆనందంగా ఉందనీ, కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందని దర్శక , నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు పీసీ ఖన్నా, కథా రచయిత బ్రహ్మారెడ్డి కమతం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement