రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ | Lakshmi Manchu And Andy Srinivasan Are Proud Hoteliers Now | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ

Published Wed, Jul 6 2016 8:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ - Sakshi

రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ

హైదరాబాద్: నటిగా, యాంకర్ గా, వ్యాపారవేత్తగా ఆమె ఎన్నో రంగాలలో మంచు లక్ష్మీప్రసన్న తనదైన ముద్రవేశారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న నటనతో ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశారు. భర్త ఆండీ శ్రీనివాసన్తో కలిసి మంచు లక్ష్మీ ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ దంపతులు ఓ రెస్టారెంట్ ను 'జూనియర్ కుప్పన్న' పేరుతో హైటెక్ సిటీలో స్టార్ట్ చేశారు.

అయితే ఈ హోటల్స్ ఇప్పటికే గ్రూపులుగా ఉన్నాయని, తమిళనాడు, కర్ణాటకలో బ్రాంచులు ఉన్నట్లు సమాచారం. ప్రధాన బ్రాంచులు తమిళనాడులో ఉన్నాయి. మంచు మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి రెస్టారెంటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు దంపతులు వారి పిల్లలు,  మంచు మనోజ్ దంపతులు, లక్ష్మీ, ఆండీ ఇతర కుటుంబసభ్యులు మనకు ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. తమ సోదరి ఈ వ్యాపారంలో రాణించాలని సోదరులు విష్ణు, మనోజ్ లు లక్ష్మీ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆండీ దంపతులను మోహన్ బాబు ఆశీర్వదించారు. పిల్లలతో సహా మంచు వారి కుటుంబసభ్యులు ఒకేచోట చేరడంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement