rta check post
-
‘ఎంట్రీ’ మామూలే!
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్పాయింట్లు అవినీతికి అడ్డాలుగా మారాయి. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సిన సిబ్బంది.. సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలించకుండానే డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు మామూలయ్యాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 44వ నంబ రు (బెంగుళూరు–నాగ్‌పూర్) జాతీయ రహదారి తో పాటు 161 వ నంబరు (సంగారెడ్డి–నాందే డ్–అకోలా) జాతీయ రహదారులపై రవాణా శాఖ చెక్‌పాయింట్, చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆ యా రహదారుల మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర, దక్షిణ భారత దేశాల్లోని వివిధ రాష్ట్రాలకు సరకుల రవాణాకు సంబంధించిన వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని పొందుర్తి సమీపంలో ఆర్టీఏ చెక్‌పాయింట్ ఉంది. దీని మీదుగా నిత్యం వందలాది లారీలు, ఇతర రవాణా వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి రవాణా వాహనం ఆగాల్సిందే.. అక్కడి సిబ్బంది అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. ఇది బహిరంగ రహస్యం. రవాణా చెక్పాయింట్లతో పాటు చెక్‌పోస్టుల వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలు, రవాణా అవుతున్న సామగ్రికి సంబంధించిన పత్రాలు, లోడ్, పన్నులు చెల్లించిన పత్రాలతో పాటు వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్లు లారీని ఆపడం, అక్కడి సిబ్బందికి డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. 161వ నంబరు జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్పూర్ ఆర్టీఏ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రవేశం పేరుతో ‘ఎంట్రీ’ అంటూ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే చెక్‌పోస్టులు, చెక్పాయింట్ల వద్ద పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అప్పుడు లెక్కకు మించిన డబ్బులు ఉన్నాయన్న ఆరోపణలతో పలువురిపై చర్యలు తీసుకున్నారు. దానికితోడు చెక్‌పోస్టులు, పాయింట్ల వద్ద రవాణా శాఖ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తులే ఎక్కువ హల్చల్ చేస్తుంటారు. జాతీయ రహదారులపై రవాణా శాఖ వసూళ్లపై లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. మూడు రోజుల్లో వేలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆర్టీఏ వసూళ్లపై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఉన్న రూ.13,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్ట్ ఇన్చార్జ్ మల్లికార్జునతోపాటు, హోంగార్డ్ ప్రసాద్‌పై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
ఆటోలు అపహరిస్తున్న దొంగల అరెస్టు
నిందితులు బావాబావమరుదులే మూడు ఆటోలు స్వాధీనం చిల్లకల్లు (జగ్గయ్యపేట) : రోడ్లపై, ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ఆటోలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు పేట సీఐ ైవె వీవీఎల్ నాయుడు తెలిపారు. సోమవారం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఆటోలసహా పట్టుకున్న దొంగలను విలేకరుల సమక్షంలో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన పోతురాజు సైదులు వ్యసనాలకు బానిసై కుటుంబంతో ఘర్షణలు తలెత్తండంతో రెండు వివాహాలు చేసుకున్నాడు. రెండో భార్య తమ్ముడు అయిన ఇబ్రహీపట్నం కొత్తూరుకు చెందిన బానావత్ దుర్గనాయక్‌తో చేతులు కలిపి ఆటోలు అపహరించుకుపోవడం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో చిల్లకల్లులో ఆగి ఉన్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. దీంతో కేసు విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు. అదేవిధంగాఇటీవల షేర్‌మహమ్మద్‌పేట, పెనుగంచిప్రోలులోనూ ఆటోలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులు అందడంతో కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో స్పేర్ పార్టులను తీసుకువెళ్తుండగా అనుమానించి వారిని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయన్నారు. ఆటోలను అపహరించుకుపోయామంటూ నేరం ఒప్పుకున్నారని తెలిపారు. దొంగలించిన ఆటోల విడి భాగాలను కోదాడలో అమ్ముతుంటారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి రూ 3.30 లక్షల విలువైన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన చేదించిన ఐడీ పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు.ఈ సమావేశంలో ఎస్ఐ షణ్ముఖ సాయి, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాల చెక్‌పోస్టు
అలంపూర్ : రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించే వాహనాలను సరిహద్దుల వద్దనే తనిఖీలు చేసి నిరోధించడానికి ఏర్పాటైన ఆర్టీఏ చెక్‌పోస్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. చెక్‌పోస్టులు ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తోంది. బెంగుళూరు-హైదరాబాదు జాతీయ రహదారిపై అలంపూర్ నియో జకవర్గంలోని మానవపాడు మండలం ఇటిక్యాలపాడు స్టేజీ వద్ద ఏర్పాటైన సరిహద్దు చెక్‌పోస్టుపై తాజాగా ఈ నెల ఎనిమిదిన ఏసీ బీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా లెక్కలో లేని సొమ్ము ఉన్నట్లు గుర్తించారు. ఆరు గంటల వ్యవధిలోనే వసూలు చేసిన సొమ్ములో రూ. 84,400 తేడా ఉన్నట్లు గుర్తించారు. నాలుగవ సారి అలంపూర్ చౌక్పోస్టులో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు నాలుగుసార్లు దాడులు నిర్వహించి ఇక్కడ జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేశారు. గత గతేడాది డిసెంబర్ 20వ తేది అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడి చేసి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి రూ.1.08 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన జరిగిన దాడిలో రూ. 50 వేలు లభ్యమయ్యాయి. ఏప్రిల్ తొమ్మిదిన ఏసీబీ అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సహాయ మోటర్ వెహి కల్ ఇన్స్పెక్టర్ ఇంటిపై(హైదరబాదులో) దాడి నిర్వహించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఈ నెల ఎనిమిదిన ఆక స్మిక తనిఖీలు చేశారు. ఇలా అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేసిన ప్రతి సారి అవినీతి సొమ్ము బయటపడుతూనే ఉంది. చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
-
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు తనిఖీ రూ.63 వేల అక్రమ వసూళ్లను గుర్తించిన అధికారులు గరికపాడు (జగ్గయ్యపేట) : మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టులో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్లోని సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్టు వద్ద వాహనాల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించామన్నారు. తనిఖీ సమయంలో వాహనాల ట్యాక్స్, పర్మిట్ల రూపంలో ప్రభుత్వానికి రూ.లక్ష రావాల్సి ఉండగా అదనంగా రూ.63వేలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నగదు అనధికారికంగా వాహనాల నుంచి వసూళ్లు చేసినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా చెక్‌పోస్టులో ఒక ఇన్చార్జి, ఆరుగురు ఎంవీఐలతో పాటు ఆరుగురు సిబ్బంది ఉండాలన్నారు. ఉద యం సమయంలో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. తనిఖీ సమయంలో చెక్‌పోస్టులో మోటార్ వెహికల్ ఇన్స్పెస్పెక్టర్లు సురేష్, నాయుడులు విధుల్లో ఉన్నారన్నారు. అనధికారికంగా గుర్తించిన సొమ్మును సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో అవినీతి అధికారులు ఉన్నట్లు తెలిసిందని వారిపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో సీఐ నాగరాజు, ఎస్ఐలు శ్రీనివాస్, వెంకటేశ్వరరావులు ఉన్నారు. -
బరితెగించారు..
- రేణిగుంట చెక్‌పోస్టు వద్ద దారుణం - పట్టుకోబోయిన సిబ్బందిపై దూసుకెళ్లిన లారీ - ప్రయివేటు జవాన్ దుర్మరణం రేణిగుంట: బడాస్మగ్లర్లు, అక్రమరవాణాదారులు బరితెగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నా రన్న నెపంతో చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బందిని హతమార్చేందుకు సిద్ధ పడుతున్నారు. జిల్లాలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సోమవారం రేణిగుంట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో సాంబశివ (47) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆగకుండా వేగంగా వెళ్లిన లారీని పట్టుకోడానికి యత్నించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఎర్రచందనం లోడుతో కర్ణాటకకు వెళ్తున్న లారీనే సాంబశివను ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో జిల్లాలోని చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రాణభయం మొదలయింది. పట్టపగలే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటే రాత్రుల్లో ఇంకెంతటి కిరాతకానికి పాల్పడతారోనన్న ఆందోళన నెలకొంది. చెక్‌పోస్టుల్లో వాహనాలు ఆగకుండా వెళితే వాటిని పట్టుకోడానికి ప్రత్యేక వాహనం ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన. ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మృతదేహంతో ధర్నా అక్రమ రవాణా లారీ ఛేజింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్టు ప్రయివేటు జవాన్ సాంబశివ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. రేణిగుంటలోని రామకృష్ణాపురానికి చెందిన సాంబశివ, హోంగార్డు సోమవారం అధిక లోడ్‌తో వెళుతున్న లారీని ఛేజింగ్ చేయగా, నాయుడుపేట-పూతలపట్టు రహదారిలో తూకివాకం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆ లారీ ఢీకొని వెళ్లడంతో అతడు మృతిచెందాడు. అనంతరం ఎస్‌ఎన్‌పురం, రామకృష్ణాపురం వాసులు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి చెక్‌పోస్టు వద్ద అతని మృతదేహంతో ధర్నా నిర్వహించారు. సాంబశివ కుటుంబసభ్యులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ైబె ఠాయించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులో ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్న ఎంవీఐ శివప్రసాద్, రేణిగుంట అర్బన్, రూరల్ సీఐలు బాలయ్య, సాయినాథ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. జీవనాధారం కోల్పోయిన కుటుంబం సాంబశివ మృతితో అతని కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. మృతి చెందిన సాంబశివకు భార్య విమల, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె యోజన ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె జ్యోత్స్న తొమ్మిదో తరగతి, కుమారుడు ఉదయ్‌కుమార్ ఆరో తరగతి చదువుతున్నారు. చెక్‌పోస్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డలను చదివిస్తూ వచ్చాడు. అతని మృతితో కుటుంబసభ్యులు బోరున రోదిస్తున్నారు. -
సరిహద్దు చెక్‌పోస్టు ఆదాయం 30 రెట్లు పెరిగింది
►గతంలో నెలకు రూ. 5 లక్షలు ►ఈ ఏప్రిల్ మాసంలోనే రూ. 1.50 కోట్లు ► ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో ►భారీగా పెరిగిన ఆదాయం కోదాడ అర్బన్ : కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం సమీపాన ఉన్న సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టుకు ఒక నెలలోనే రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఏపీ రాష్ట్ర వాహనాల నుంచి పన్నులు వసూలు ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాహనాలే కాకుండా ఇతర రాష్ట్రాల వాహనాలను కూడా కలుపుకొని ఒక్క నెలలోనే మొత్తం రూ. 1.5కోట్ల ఆదాయం రావడం గమనార్హం. గతంలో నెలకు రూ. 5లక్షలు ఉన్న ఈ చెక్‌పోస్టు ఆదాయం ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో 30 రెట్లు పెరిగింది. ట్యాక్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు కాగా ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ట్యాక్స్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల వసూలుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనికానిస్తున్నట్లు సమాచారం. సమీప గ్రామాలకు వెళ్లే వాహనాలనుంచి ట్యాక్స్ కాకుండా మామూళ్లు తీసుకొని వదులుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై చెక్‌పోస్టు ఎంవీఐ షౌకత్‌అలీని వివ రణ కోరగా.. తమ వద్ద ప్రైవేట్ వ్యక్తులెవరూ విధులు నిర్వర్తించడం లేదని తెలిపారు. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ చెక్‌పోస్టులకు మొత్తం ఎనిమిది సిబ్బంది ఉన్నారని, రోజుకు నలుగురు చొప్పున చెక్‌పోస్టులో విధులు నిర్వరిస్తున్నట్లు తెలిపారు. -
అక్రమాలకు అడ్డా !
పాల్వంచ, న్యూస్‌లైన్: జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్ట్ అవివీతి అక్రమాలకు అడ్డాగా మారింది. మన రాష్ట్రం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే మార్గంలో నాగారం స్టేజీ సమీపంలో ఉన్న ఈ ఏకైక చెక్‌పోస్ట్ కాసుల పంట కురిపిస్తోంది. నిత్యం ఈ రహదారిలో వెళ్లే వాహనాల నుంచి అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. సిబ్బంది ఇలా వసూలు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని ఉన్నతాధికారులకు కూడా ముట్టజెపుతుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చెక్‌పోస్ట్‌పై ఆదివారం ఉదయం జరిగిన ఏసీబీ దాడితో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆపరేటర్ వేణు అక్రమంగా వసూలు చేసిన రూ.13,650 ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రాత్రే లారీల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదు ఇంత మొత్తంలో ఉండడం గమనార్హం. ఇలా నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాహనాలకు అన్ని పర్మిట్లు ఉన్నా.. అధికారులకు ఎంతో కొంత ఇచ్చుకోకుండా ఈ చెక్‌పోస్ట్ దాటలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని బీపీఎల్‌కు వెళ్లే కర్రలోడు, పేపర్ కంటైనర్ లోడ్ లారీలు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఐరన్‌ఓర్, నవభారత్, ఎన్ఎండీసీ కర్మాగారాల్లో తయారై వైజాగ్ వెళ్లే స్టీల్ ముడిసరుకు, మణుగూరు కోల్‌మైన్ నుంచి తరలే బొగ్గు, అక్రమ ఇసుక, బియ్యం రవాణా, ఇతర నిత్యావసర వస్తువులు, గ్యాస్, పాఠశాల బస్సులు, ఆటోల్లో ఓవర్ లోడు, లెసైన్స్ లేని వాహనాలు, రాష్ట్రాలు దాటి వచ్చే వాహనాలు.. ఇలా ఏది వెళ్లినా డబ్బు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఇలా రోజుకు రూ. 30 వేల నుంచి 50 వేల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాసుల పంట పండిస్తున్న ఇసుక అక్రమ రవాణ.. గోదావరి పరివాహక ప్రాంత సమీపంలో ఉన్న భద్రాచలం, గొమ్మూరు, సారపాక ర్యాంపులు, చర్ల, వెంకటాపురం, గొమ్ము కొత్తగూడెం, కొల్లుగూడెం, కిన్నెరసాని వాగు నుంచి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా చేసే లారీలు ఈ చెక్‌పోస్ట్‌కు కాసులు కురిపిస్తున్నాయి. ఈ వాహనాల్లో పరిమితికి మించి అధిక టన్నుల ఇసుకను తరలిస్తుంటారు. ఇందుకు గాను వే బ్రిడ్జిల నుంచి తప్పుడు బిల్లులు సృష్టించి తీసుకెళుతున్న వాటికి ఆర్టీఏ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకుండా డబ్బు వ సూలు చేసి పంపిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. లారీల తరలిస్తున్న దందాలో ఆర్టీఏ అధికారులతో పాటు పోలీసులకు కూడా వాటాలు ఉన్నాయనే విమర్శలున్నాయి. వీరి దందాకు ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతల అండదండలు సైతం పుష్కలంగా ఉండటం గమనార్హం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం : ఏసీబీ డీఎస్పీ అవినీతికి ఆలవాలుగా మారిన ఈ చెక్‌పోస్ట్ అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ పి.సాయిబాబు తెలిపారు. తాము దాడి చేసిన సమయంలో విధుల్లో ఉన్న ఏఎంవీఐ ప్రమీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వేణు ఓ లారీ డ్రైవర్ నుంచి రూ.800 వసూలు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. దీంతో వేణు ఆ మొత్తంతో పాటు అంతకుముందే తన వద్దనున్న రూ.13,650 చెక్‌పోస్ట్ వెనుకకు పడేశాడని, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
పెనుకొండ,న్యూస్‌లైన్: మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద సోమవారం హైవే పెట్రోలింగ్ పోలీ సులు 9 ఎర్ర చందనం దుంగల్ని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుం దని పోలీసులు తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల కథనం మేరకు.. అక్రమంగా ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్నట్లు సమాచారం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సీఐ రామకృష్ణ ఆదేశించడంతో సోమవారం హైవే పెట్రోలింగ్ సిబ్బంది చెన్నకేశవులు, ప్రతాప్, సలీం బాషా, గోపా ల్ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఉదయం నుంచి నిఘా ఉంచారు. ఈ క్రమం లో 8.30 గంటల ప్రాంతంలో కేఏ.02 పీ-7654 నంబరు గల కారు బెంగళూరు వైపు వెళుతోంది. చెక్ పోస్టు వద్ద రోడ్డు పక్కన హైవే పెట్రోలింగ్ వాహనం నిలిచి ఉండడాన్ని చూసిన చిత్తూరుకు చెందిన డ్రైవర్ రెడ్యానాయక్ కారును నెమ్మదిగా పోనిచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు దగ్గరకు వెళ్లగానే అతను కారును నిలిపేశాడు. అందులో ఉన్న మరో వ్యక్తి ఉన్నఫళంగా కిందకు దూకి పరారయ్యాడు. దీంతో కారును తనిఖీ చేయడంతో సీట్ల కింద, డిక్కీలోనూ దాచి తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. స్థానిక అటవీ శాఖ సిబ్బం ది కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు రెడ్యానాయక్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.