ఆటోలు అపహరిస్తున్న దొంగల అరెస్టు
నిందితులు బావాబావమరుదులే
మూడు ఆటోలు స్వాధీనం
చిల్లకల్లు (జగ్గయ్యపేట) : రోడ్లపై, ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ఆటోలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు పేట సీఐ ైవె వీవీఎల్ నాయుడు తెలిపారు. సోమవారం చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో ఆటోలసహా పట్టుకున్న దొంగలను విలేకరుల సమక్షంలో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన పోతురాజు సైదులు వ్యసనాలకు బానిసై కుటుంబంతో ఘర్షణలు తలెత్తండంతో రెండు వివాహాలు చేసుకున్నాడు.
రెండో భార్య తమ్ముడు అయిన ఇబ్రహీపట్నం కొత్తూరుకు చెందిన బానావత్ దుర్గనాయక్‌తో చేతులు కలిపి ఆటోలు అపహరించుకుపోవడం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో చిల్లకల్లులో ఆగి ఉన్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. దీంతో కేసు విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు. అదేవిధంగాఇటీవల షేర్‌మహమ్మద్‌పేట, పెనుగంచిప్రోలులోనూ ఆటోలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులు అందడంతో కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశామన్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో స్పేర్ పార్టులను తీసుకువెళ్తుండగా అనుమానించి వారిని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయన్నారు. ఆటోలను అపహరించుకుపోయామంటూ నేరం ఒప్పుకున్నారని తెలిపారు. దొంగలించిన ఆటోల విడి భాగాలను కోదాడలో అమ్ముతుంటారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి రూ 3.30 లక్షల విలువైన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన చేదించిన ఐడీ పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు.ఈ సమావేశంలో ఎస్‌ఐ షణ్ముఖ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.