అలంపూర్ : రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించే వాహనాలను సరిహద్దుల వద్దనే తనిఖీలు చేసి నిరోధించడానికి ఏర్పాటైన ఆర్టీఏ చెక్‌పోస్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. చెక్‌పోస్టులు ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తోంది. బెంగుళూరు-హైదరాబాదు జాతీయ రహదారిపై అలంపూర్ నియో జకవర్గంలోని మానవపాడు మండలం ఇటిక్యాలపాడు స్టేజీ వద్ద ఏర్పాటైన సరిహద్దు చెక్‌పోస్టుపై తాజాగా ఈ నెల ఎనిమిదిన ఏసీ బీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా లెక్కలో లేని సొమ్ము ఉన్నట్లు గుర్తించారు. ఆరు గంటల వ్యవధిలోనే వసూలు చేసిన సొమ్ములో రూ. 84,400 తేడా ఉన్నట్లు గుర్తించారు.
నాలుగవ సారి
అలంపూర్ చౌక్‌పోస్టులో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు నాలుగుసార్లు దాడులు నిర్వహించి ఇక్కడ జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేశారు. గత గతేడాది డిసెంబర్ 20వ తేది అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడి చేసి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ నుంచి రూ.1.08 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన జరిగిన దాడిలో రూ. 50 వేలు లభ్యమయ్యాయి.
ఏప్రిల్ తొమ్మిదిన ఏసీబీ అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సహాయ మోటర్ వెహి కల్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై(హైదరబాదులో) దాడి నిర్వహించి అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఈ నెల ఎనిమిదిన ఆక స్మిక తనిఖీలు చేశారు. ఇలా అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేసిన ప్రతి సారి అవినీతి సొమ్ము బయటపడుతూనే ఉంది. చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమాల చెక్‌పోస్టు
Published Wed, Sep 9 2015 11:39 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement