పెనుకొండ,న్యూస్‌లైన్:
మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద సోమవారం హైవే పెట్రోలింగ్ పోలీ సులు 9 ఎర్ర చందనం దుంగల్ని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుం దని పోలీసులు తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల కథనం మేరకు.. అక్రమంగా ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్నట్లు సమాచారం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సీఐ రామకృష్ణ ఆదేశించడంతో సోమవారం హైవే పెట్రోలింగ్ సిబ్బంది చెన్నకేశవులు, ప్రతాప్, సలీం బాషా, గోపా ల్ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఉదయం నుంచి నిఘా ఉంచారు. ఈ క్రమం లో 8.30 గంటల ప్రాంతంలో కేఏ.02 పీ-7654 నంబరు గల కారు బెంగళూరు వైపు వెళుతోంది.
చెక్ పోస్టు వద్ద రోడ్డు పక్కన హైవే పెట్రోలింగ్ వాహనం నిలిచి ఉండడాన్ని చూసిన చిత్తూరుకు చెందిన డ్రైవర్ రెడ్యానాయక్ కారును నెమ్మదిగా పోనిచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు దగ్గరకు వెళ్లగానే అతను కారును నిలిపేశాడు. అందులో ఉన్న మరో వ్యక్తి ఉన్నఫళంగా కిందకు దూకి పరారయ్యాడు. దీంతో కారును తనిఖీ చేయడంతో సీట్ల కింద, డిక్కీలోనూ దాచి తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. స్థానిక అటవీ శాఖ సిబ్బం ది కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు రెడ్యానాయక్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఎర్రచందనం దుంగల స్వాధీనం
Published Tue, Sep 24 2013 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement