తెలంగాణ పోలీసులకు బ్యాడ్జీలు రెడీ | police badges to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులకు బ్యాడ్జీలు రెడీ

Published Sat, Aug 16 2014 1:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

తెలంగాణ పోలీసులకు బ్యాడ్జీలు రెడీ - Sakshi

తెలంగాణ పోలీసులకు బ్యాడ్జీలు రెడీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసు యంత్రాంగానికి  కొత్తబ్యాడ్జీలను ప్రకటించింది. రాష్ట్ర పోలీసు శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయం వివిధ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది ధరించాల్సిన క్యాప్(టోపీ), షోల్డర్(భుజం), బెల్టులకు సంబంధించిన కొత్త బ్యాడ్జీలను రూపొందించింది. గురువారం రాత్రి పొద్దుపోయాక ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విభాగం, హోదాను బట్టి అధికారులను గుర్తించేలా ఈ బ్యాడ్జీలను రూపొందించారు.

బ్యాడ్జీలన్నింటిపై ఇత్తడి పూత పూశారు. క్యాప్, బెల్టు బ్యాడ్జీలు ఆకృతిలో దాదాపు ఒకేలా ఉన్నాయి.  టోపీకి బిగించుకునే విధంగా బ్యాడ్జీ వెనక భాగంలో పిన్ను ఉండడమే క్యాప్ బ్యాడ్జీ ప్రత్యేకత. క్యాప్, బెల్టు బ్యాడ్జీల పైభాగంలో జాతీయ చిహ్నంతో పాటు మధ్యలో టీఎస్‌పీఎస్(తెలంగాణ స్టేట్ పోలీసు సర్వీసు) అనే ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. షోల్డర్ బ్యాడ్జీలను కూడా ఇత్తడిపూతతో తయారు చేశారు.అన్ని విభాగాలకు చెందిన డిఐజీ(నాన్ కేడర్), ఎస్పీ(నాన్ కేడర్), ఏఎస్పీ, డీఎస్పీలు ధరించాల్సిన బ్యాడ్జీలు

ఏ)    క్యాప్‌బ్యాడీ/ బెల్టుబ్యాడ్జి:  టీఎస్‌పీఎస్ అనే చిన్న(స్మాల్) ఆంగ్ల అక్షరాలుంటాయి.
బి)షోల్డర్ బ్యాడ్జీ: బ్యాడ్జీపై ‘టీ.ఎస్.పీ.ఎస్’ అనే పెద్ద(క్యాపిటల్) ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. అన్ని విభాగాలకు చెందిన ఇన్‌స్పెక్టర్/ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్,  సబ్- ఇన్‌స్పెక్టర్/ రిజర్వు సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ -ఇన్‌సెక్టర్/ రిజర్వ్ అసిస్టెంట్ సబ్- ఇన్‌స్పెక్టర్‌ల బ్యాడ్జీలు:
ఏ)    క్యాప్/ బెల్టు బ్యాడ్జీ: బ్యాడ్జీ మధ్యలో టీఎస్‌పీ (తెలంగాణ స్టేట్ పోలీస్) అనే పెద్ద ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు.
బి)షోల్డర్ బ్యాడ్జీ: టీఎస్‌పీ అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలతో బ్యాడ్జీని రూపొందించారు. పైన పేర్కొన్న రిజర్వ్ విభాగం అధికారుల కోసం ప్రత్యేక షోల్డర్ బ్యాడ్జీని తయారు చేశారు.

‘రిజర్వ్’ షోల్డర్ బ్యాడ్జీ: టీఎస్‌ఎస్‌పీఎస్(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు సర్వీసు) అనే ఆంగ్ల అక్షరాలతో బ్యాడ్జీని రూపొందించారు. ఇందులో పోలీసు కానిస్టేబుల్  నుంచిఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు వీటిని ధరించనున్నారు.అన్ని విభాగాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులు: క్యాప్/బెల్టు బ్యాడ్జీ: బ్యాడ్జీల మధ్యలో టీఎస్‌పీ అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. హోంగార్డులు: హోంగార్డులకు ప్రత్యేకంగా క్యాప్, బెల్టు బ్యాడ్జీలుండవు. వీరి కోసం టీఎస్‌హెచ్‌జీ (తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్) అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలతో షోల్డర్ బ్యాడ్జీని రూపొందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement