జూనియర్ డాక్టర్ల సమ్మె శుక్రవారం కూడా కొనసాగుతోంది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మె శుక్రవారం కూడా కొనసాగుతోంది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు ప్రకటించింది.
కాగా జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.