హైదరాబాద్: తమ చేపట్టిన దీక్ష కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు (జూడాలు) గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ న్యాయమైన ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూస్తోందని వారు ఆరోపించారు. దీక్ష చేస్తున్న తమను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారని విమర్శించారు.
త్వరలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని జూడాలు హెచ్చరించారు. తమ ఆందోళనకు ప్రజల మద్దతు ఉందని జూడాలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలవాలని జూడాలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.