జూనియర్ వైద్యులు సమ్మెను వెంటనే విరమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని తెలిపింది. దీనిపై సోమవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ డాక్టర్లకు వర్తించదని, సమ్మె చేయడానికి జూనియర్ వైద్యులు రోజువారీ కూలీలు కాదని పేర్కొంది. సమ్మె చేసే హక్కు జూడాలకు లేదని పేర్కొన్న హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మెకు పలువురు సంఘీభావం ప్రకటించారు.
Published Mon, Oct 27 2014 3:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:53 PM
Advertisement
Advertisement
Advertisement