సమంజసం కాదు: వైఎస్ జగన్ | Ys Jagan mohan reddy Concerns to Telangana govt hand over from APNGOs land allocation | Sakshi
Sakshi News home page

సమంజసం కాదు: వైఎస్ జగన్

Published Sat, Jul 5 2014 3:38 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సమంజసం కాదు: వైఎస్ జగన్ - Sakshi

సమంజసం కాదు: వైఎస్ జగన్

ఏపీఎన్జీవోలకు హైదరాబాద్‌లో కేటాయించిన 189 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీఎన్జీవోల భూమి స్వాధీనంపై వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలకు హైదరాబాద్‌లో కేటాయించిన 189 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తిరిగి ఆ భూములను ఏపీఎన్జీవోలకు అప్పగించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 
ఈ భూముల కేటాయింపు రెండు దశాబ్దాల కిత్రమే జరిగిందని, ఆ భూమిని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాట్లుగా విభజించుకుని.. అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల అభివృద్ధికోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను రద్దు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వేరెవరికైనా భూ కేటాయింపులు చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయంకోసం చూడాలి తప్పిస్తే, ఈ భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని సూచించారు. ఈ భూములను తిరిగి ఏపీఎన్జీవోలకు అప్పగించడమే న్యాయమన్నారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలుంటే వాటిపై ఏపీ ప్రభుత్వం కలుగజేసుకుని ఏపీఎన్జీవోలకు అండగా నిలబడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement