సాక్షి, మంచిర్యాల :తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైన నేపథ్యంలో తదుపరి దశల్లోనూ సర్కారు అదే స్పష్టతతో ముందుకెళ్తోంది. ఒక్కరోజే సర్వే చేయడం ద్వారా అక్రమాలకు తావు లేని విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా సర్వే ఫారాల క ంప్యూటరీకరణకు ముందు సైతం వివరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా స్టార్ మార్కుతో ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఓ అధికారి వివరించారు. నోడల్ అధికారులుగా సర్వే బాధ్యతలు నిర్వర్తించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అగ్రికల్చర్ అధికారులు, ఎంఈవోలపై ఈ గురుతర బాధ్యత పెట ్టనున్నట్లు సమాచారం. ఈ నోడల్ అధికారులు సర్వే నమూనాలో నింపకుండా వదిలివేసిన వివరాలను లబ్ధిదారులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా సేకరించనున్నారు.
స్టార్.. స్టార్..
గ్యాస్ కనెక్షన్, విద్యుత్ మీటరు కనెక్షన్ నంబరు వంటి ‘స్టార్’ గుర్తు గల విషయాలను ప్రాధాన్య అంశాలుగా
తీసుకోనున్నారు. స్టార్ గుర్తున్న వివరాలు పూర్తి చేయని పక్షంలో సర్వే ఫామ్‌లో పేర్కొన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేసి వాటిని తెలుసుకొని పెన్సిల్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ విధంగా సర్వే జరిగిన అన్ని కుటుంబాల వివరాల విషయమై నోడల్ అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
ఫామ్‌లోని అన్ని వివరాలు సమగ్రంగా ఉంటేనే ఆ కుటుంబ వివరాలను అప్‌డేట్ చేసేలా సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేశారు. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేసిన తర్వాత సైతం థర్డ్‌పార్టీ తనిఖీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లాస్థాయి అధికారి ఒకరు వివరించారు. ఈ క్రమంలోనే సర్వే ఫామ్‌లోని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫామ్‌ల కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం పరిశీలించే అవకాశాలున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.
ఫోన్ చేస్తారు..సమాచారం సేకరిస్తారు
Published Mon, Aug 25 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement
Advertisement