strick
-
తగ్గేదేలే అంటున్న విశాఖ ఉక్కు కార్మికులు
-
‘బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ఈ కుట్ర'!
కొరిటెపాడు (గుంటూరు): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని జాతీయ బ్యాంకు ఉద్యోగులు మొదటి రోజు గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 12 జాతీయ బ్యాంకుల పరిధిలో 450 శాఖలు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. జిల్లాలోని 450 ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడటంతో దాదాపు రూ.120 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా ప్రభుత్వ బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మెలో భాగంగా గురువారం జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రతి పౌరుడు, ప్రతి ఖాతాదారుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. గతంలో అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లు చేసి పారిశ్రామిక సామ్రాజ్యం అవసరాలకు వాడుకొని దివాళా తీయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కారణంగానే దేశ ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకుందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, యూనియన్ల నేతలు వి.రాధాకృష్ణమూర్తి, సురేష్, హనుమంతరెడ్డి, లక్ష్మీనారాయణ, హరిబాబు, బాషా, మురళీ నాగేంద్ర, రవి, షరీఫ్, వేణు, రామారావు, క్రాంతి, పావని, జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
‘గాంధీ’ డాక్టర్‌పై దాడి.. జూడాల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : ఓ డాక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చేపట్టిన ధర్నాఇంకా కొనసాగుతోంది. ఎమర్జెన్సీ తప్ప అన్ని విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సీతాఫల్మండి రవీంద్రనగర్‌కు చెందిన సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చశారు. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి వెంబడి బైటాయించి ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలోనే శాంతి ర్యాలీ నిర్వహించారు. జడాల ఆందోళనతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వమే డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ఏపీ గ్రామీణ వైద్యానికి చంద్రగ్రహణం
-
‘ఉపాధి’ సిబ్బంది సమ్మె బాట
సంతమాగులూరు: సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరుగా సమ్మె బాట పడుతున్నారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రోడ్డెక్కారు. దీంతో వెలుగు కార్యాలయాల్లో పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వారి బాటలోనే ఉపాధి హామీ సిబ్బందీ నడవనున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూజనవరి 2వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో 1500 మందికిపైగా సమ్మెలో పాల్గొననున్నట్లు జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మి తెలిపారు. సమ్మె విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి సిబ్బంది ఆయా ఎంపీడీవోలకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారన్నారు. పదేళ్ల నుంచి పోరాటం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది రాత్రిపగళ్లు తేడా లేకుండా కష్టపడుతున్నా వారి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం లేదు. పదేళ్ల నుంచి జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోతున్నారు. ఈనెల 10న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారాలోకేష్ ను కలిసి సమస్యను విన్నవించుకున్నా ఇంత వరకు పట్టించుకునే వారే లేరని దీంతో సమ్మె బాట పట్టాల్సి వస్తోందని వారు తెలిపారు. 2016 పీఆర్సీని అనుసరించి కేడర్ వారీగా జీతాలు పెంచాలని కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే... ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ సీనియారిటీ ప్రతిపాదికను 2016 పీఆర్సీ అనుసరించి టైం స్కేల్ అమలు చేసి జీతాలు పెంచాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనేందుకు ఉపాధి సిబ్బంది సంసిద్ధులవుతున్నారు. జీతాలు పెంచకపోతే కుటుంబ పోషణ గడవాలన్నా కష్టతరంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేల్కొనాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మా పరిస్థితి ఏంటి: ఏళ్ల తరబడి జీతాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకపోవటంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నందున ఈలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మళ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చిందాకా ఎదురు చూడాల్సిందేనా అని వారు లబోదిబోమంటున్నారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చి సమ్మెలో పాల్గొనే లోపే మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయిస్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది మాత్రం శూన్యం. జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది విధులు కష్టతరంగా ఉన్నా పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – కె.లక్ష్మి జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్ -
‘మనీ’వేదన!
పాలమూరు : బ్యాంక్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవులు.. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడడంతో నిత్యం లావాదేవీలు నడిపించే వ్యాపారులు మొదలు సాధారణ ప్రజలు వరకు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన లావాదేవీలు నడిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, తదితర జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో శుక్రవారం తెరుచుకోకపోగా విషయం తెలియని సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత రెండు రోజుల సాధారణ సెలవులు రాగా.. సోమవారం ఒక రోజు మాత్రమే బ్యాంకులు తెరుచుకోనున్నా యి. మళ్లీ మంగళవారం క్రిస్మస్ సెలవు, ఆ మరుసటి రోజు బుధవారం మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీంతో సోమవారం తప్పించి వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడుతున్నట్లవుతోంది. నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారు. ప్రధానంగా వ్యాపారులకు బ్యాంకుల ద్వారా డబ్బు పంపడం, తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గా ల వారు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారుల కు ఒకే రకమైన సవరణ ఉండేది. 11వ వేతన సవరణలో అధికారుల పనితీరు ఆధారంగా వేతన సవరణ చేయాలన్న యాజమాన్యాలు నిర్ణయించి, అమలు చేస్తుండడాన్ని నిరసిస్తూ బ్యాంకు అధికారులు సమ్మెకు వెళ్తున్నారు. దీం తో పాటు చిన్న బ్యాంకుల విలీనాన్ని చేయ రాదని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో సాధారణ సెలవులు, క్రిస్మస్ సెలవు రావడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరుస సెలవులతో వెతలు బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె కారణం గా బ్యాంకుల సేవలు ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈనెల 21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేశారు. ఈనెల 22న నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు. 23న ఆదివారం సాధారణ సెలవు. 24వ తేదీ సోమవారం బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. ఇక ఈనెల 25న కిస్మస్ పండగ సెలవు. 26న బ్యాంకు ఉద్యోగుల సామూహిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఆ రోజు బ్యాంకులు పని చేయవు. మొత్తం మీద వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే బ్యాంకులు పని చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ఏర్పడే అవకాశం నెలకొంది. సాధారణ రోజుల్లోనే ఏటీఎంలో నగదు లేక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏటీఎంలలో గురువారం పెట్టిన నగదు శనివారం ఉదయం వరకు ఖాళీ అయ్యింది. దీంతో చాలా మంది ఏటీఎంల చుట్టూ డబ్బు కోసం తిరగడంకనిపించింది. ఈనెల 25న క్రిస్మస్ పండగ ఉండటంతో క్రిస్టియన్లు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాలి. కానీ పరిస్థితిని చూస్తే పండుగ జరుపుకునేందుకు నగదు ఎలా సమకూర్చుకోవాలని వారు ఆలోచనలో పడ్డారు. కాగా, ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్, ఐసీఐసీఐతో పాటు సహకార బ్యాంకులు తప్ప మిగిలిన జాతీయ బ్యాంకులన్నీ మూతపడటంతో వారం రోజుల పాటు నగదు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఏటీఎంలన్నీ ఖాళీ జిల్లాలో ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా డబ్బు పెట్టకపోవడంతో జనం నిరాశగా వెళ్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోనే 30కుపైగా ఏటీఎంల్లో ఏ ఒక్కదాంట్లోనూ డబ్బు లేకపోవ డం గమనార్హం. ప్రధాన ఏటీఎంల్లో కొంత డ బ్బు పెడుతున్నా గంటలోపే అయిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బు ఉన్నట్లు తెలియగానే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఇందులో కొందరికే డబ్బు అందుతుండగా.. మిగతా వారే నిరాశతో వెనుతిరుగుతున్నారు. రూ.5వేల కోసం 10ఏటీఎంలు తిరిగాను నాకు ఈరోజు ఉదయం అత్యవసరంగా రూ.5వేలు కావాల్సి వచ్చింది. ఖాతాలో డబ్బు ఉందన్న ధైర్యంతో ఏటీఎంకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు కనిపించింది. అలా పట్టణంలోని దాదాపు 10ఏటీఎంలు తిరిగినా అదే పరిస్థితి ఎదురైంది. మామూలు రోజుల్లో ఏటీఎంల్లో డబ్బు పెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువ డబ్బు ఉంచడమో లేదా ప్రతిరోజు రెండు పూజలా డబ్బు పెట్టడమో చేస్తే మాలాంటి వారికి ఇబ్బందులు తప్పుతాయి. – వినోద్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ -
రైట్.. రైట్..!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా అంశాలపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో సోమవారం తెల్లవారు జాము (11వ తేదీ) నుంచి తాము తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ సర్వీసులు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు టీఎంయూ నేతల తీరుపై ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వేతన సవరణ కాకుండా ఐఆర్‌కు అంగీకరించడం సరికాదని, ఇది కార్మికులను దగా చేయడమేనని ఆరోపించాయి. కొద్దిరోజులుగా టెన్షన్.. కొంతకాలంగా వేతన సవరణ కోసం డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.. ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టుదలకు పోవడంతో కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది. 2015లో ఎనిమిది రోజులు సమ్మె తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణకు అంగీకరించలేదు. ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొనేలా కనిపించింది. ముఖ్యంగా సమ్మెకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులను తొలగిస్తామని, ఆర్టీసీని మూసివేసే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించడం ఒక్కసారిగా వేడి రగిలించింది. దీనిపై కార్మిక సంఘాలు తొలుత ఆందోళన చెందినా.. సీఎం బెదిరింపులకు బెదరబోమని, సమ్మె చేసి తీరుతామని ప్రకటించాయి. కానీ హరీశ్ నేతృత్వం లోని మంత్రుల బృందం రంగంలోకి దిగి.. అటు కార్మిక సంఘాలతో, ఇటు సీఎంతో చర్చలు జరపడం ప్రారంభించాక పరిస్థితిలో మార్పు వచ్చింది. శాంతించిన సీఎం.. కార్మిక సంఘాల తీరుపై తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చివరికి సానుకూలంగా స్పందించారు. మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించేందుకు అంగీకరించారు. దీంతో ఆదివారం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ, మంత్రుల బృందానికి మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. తొలుత 25% ఐఆర్ ఇవ్వాలని కోరిన కార్మిక సంఘం నేతలు.. కనీసం 18 శాతానికి తగ్గకుండా ప్రకటించాలని పట్టుబట్టారు. ఇటు సీఎం అనుమతి మేరకు మంత్రులు తొలుత 10 శాతం ఐఆర్ ఇస్తామని కార్మిక సంఘం నేతలకు చెప్పారు. కానీ కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు మూడు సార్లు అటు సీఎంతో, ఇటు కార్మిక సంఘంతో సమావేశమైన మంత్రులు.. చివరికి 16 శాతం ఐఆర్ ఇస్తామని, సమ్మె విరమించుకోవాలని కోరారు. దీనికి టీఎంయూ నేతలు సమ్మతించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమైనట్టయింది. ఆదివారం సాయంత్రం మంత్రులు, టీఎంయూ నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, చర్చలు సఫలమైనట్టు ప్రకటించారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున.. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు టీఎంయూ నేతలు వెల్లడించారు. ఇక ‘ఆర్టీసీ’ని సరిదిద్దే చర్యలు! ప్రస్తుతం ఆర్టీసీకి రూ.3 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. సాలీనా రూ.680 కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. తాజాగా 16 శాతం ఐఆర్ ఇవ్వనుండటంతో ఏటా రూ.200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఇది సంస్థపై పెనుభారం చూపే అంశం కావడంతో.. ఆర్టీసీలో దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీకి ఉన్న అప్పులను తీర్చడంలో వన్‌టైం సెటిల్మెంట్ కింద కొంత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీకి డీజిల్ ధరల పెరుగుదల పెనుభారంగా మారిన నేపథ్యంలో... డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని, మోటారు వాహనాల పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. కొంతకాలంగా నియామకాలు లేక ఖాళీగా ఉన్న దాదాపు 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘం నేతలు, ఐఏఎస్ అధికారులు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు. రెండు మూడు రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని మంత్రుల బృందం వెల్లడించింది. కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇక చిన్నచిన్న విషయాలపై కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్ చేస్తుండటంతో వారి ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతోందన్న కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశాల్లో క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు మరో కమిటీ వేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు సంబంధించి 27 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలన్న డిమాండ్ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినా అమలుకాకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే అమలు చేయాలని ఆదేశించారని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దానికి సంబంధించి బకాయిలను నగదు రూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లను కార్మికులకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది కార్మికులను దగా చేయడమే.. టీఎంయూపై ఇతర కార్మిక సంఘాల ఆగ్రహం: కేవలం మధ్యంతర భృతికి అంగీకరించి సమ్మె విరమించడం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ వైఫల్యమేనని ఆర్టీసీలోని ఎన్ఎంయూ, ఈయూ, టీజేఎంయూ తదితర ఏడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన సవరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు.. ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతితో సరిపుచ్చటం వారిని దగా చేయడమేనని విమర్శించాయి. టీఎంయూ మరోసారి కార్మికులను మోసం చేసిందని, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి తక్కువ మధ్యంతర భృతికి అంగీకరించిందని ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమల్‌రెడ్డి, నరేందర్, మౌలానా తదితరులు ఆరోపించారు. టీఎంయూ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా సోమవారం తమ సంఘం నిరసన ప్రదర్శనలు చేస్తుందని ప్రకటించారు. ఇక టీఎంయూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తక్కువ ఐఆర్‌కు అంగీకరించిందని టీజేఎంయూ నేత హనుమంతు ఆరోపించారు. తమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్ని డిపోల ఎదుట టీఎంయూ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ లెక్కలివీ.. 54,000 కార్మికుల సంఖ్య 3,000 కోట్లు..ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు గత వేతన సవరణ 44% ఫిట్మెంట్ దానితో ఆర్టీసీపై పడిన భారం750కోట్లుసాలీనా 680కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 200కోట్లు..తాజాగా ఐఆర్‌తో ఏటా అదనపు భారం -
సమ్మెకెళితే వేటే.!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మెలను నిషేధించినా కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇచ్చారని, యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగాలు పోగొట్టుకోదలచిన కార్మికులు మాత్రమే సమ్మెకు దిగాలన్నారు. సమ్మెకు వెళితే తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని.. ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలని, కేవలం 53 వేల ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. యావత్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సమ్మె అన్న ఆలోచనే ఆత్మహత్య సదృశమని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనదలుచుకోనివారు.. తమ నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియచేయాలని సూచించారు. ఈ నెల 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ యూనియన్లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డిమాండ్లు నెరవేర్చే విషయంలో సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్ గురువారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్టీసీ సమ్మెతో పూర్తిగా మునిగిపోతుందని పేర్కొన్నారు. సమ్మె అసమంజసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సమయంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడం అసమంజసమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘రూ.3,000 కోట్ల అప్పు, ఏటా రూ.250 కోట్ల వడ్డీ భారం, ఏటా రూ.700 కోట్ల నష్టంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనుగడ సాగిస్తోంది. కానీ యూనియన్ నాయకులు సంస్థపై మరో రూ.1,400 కోట్ల భారం పడేలా డిమాండ్లతో సమ్మెకు నోటీసివ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలి. ఒకసారి సమ్మెకు పోవడమంటూ జరిగితే.. ఇప్పుడున్న నష్టాలకు తోడు అదనంగా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. యూనియన్ నాయకుల అసంబద్ధమైన కోరికలైన 25 శాతం ఐఆర్, 50 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు ఏటా మరో రూ.1,400 కోట్లు అదనపు భారం ఆర్టీసీపై పడుతుంది. సమ్మెకు వెళ్లి కార్మికుల గొంతు కోసేదానికంటే సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలనే దానిపై యూనియన్ నాయకులు దృష్టి పెట్టాలి..’’అని సీఎం హితవు పలికారు. ఆర్టీసీని ముక్కలు చేయాల్సి రావచ్చు.. దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచామని.. భవిష్యత్తులో సంస్థను లాభాల బాటలో నడిపించాలని కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటికీ ఫలితం కనిపించలేదని స్పష్టం చేశారు. ‘‘రెండేళ్ల కింద ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరిపినపుడు మొత్తం 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని స్పష్టమైంది. రెండేళ్లయినా ఏ మార్పూ రాలేదు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్లను ఎత్తివేయడమో, నామమాత్రంగా నడపడమో, లేదా పునర్వవస్థీకరించడమో జరిగింది. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 7.. ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారు. ఇదే పద్ధతిని తెలంగాణలోనూ అవలంబించాల్సిన పరిస్థితులు రావచ్చు..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో ప్రైవేట్ సంస్థలు బ్యాంకు రుణాతో బస్సులు కొని, నడుపుతూ.. లాభాలతో రుణాలు కూడా తీర్చేస్తున్నాయన్నారు. అలాంటప్పుడు యూనియన్ల అలసత్వం వలన ఆర్టీసీ నష్టాల్లో పోవడం సమంజసం కాదని, ఆర్టీసీని ఎలా లాభాల బాట పట్టించాలనే దానిపై వారు ఆలోచన చేయాలని సూచించారు. అంతేతప్ప యూనియన్ ఎన్నికల్లో గెలవాలనో, స్వార్థ పూరిత ఆలోచనలతోనో ప్రభుత్వాన్ని, కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ మనుగడ ఎట్లా? యూనియన్ నాయకుల డిమాండ్లను అంగీకరిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.1,400 కోట్ల అదనపు భారం పడుతుందని.. ఇప్పటికే ఉన్న అప్పులు, నష్టాలు కలసి ఆర్టీసీ మనుగడ ఎలాగని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నష్టాలను పూడ్చుకోవడం కోసం బస్సు చార్జీలు పెంచాలని యానియన్ నాయకులు అడగటం అసమంజసమని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడేలా చార్జీలు పెంచాలని కోరడం దారుణమన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చడం కోసం ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని అంటున్నారని.. దీనికి ఐదారు వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వ్యయం చేస్తున్న నేపథ్యంలో.. ఆర్టీసీ భారాన్ని భరించటం కష్టమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆర్టీసీ మునిగిపోతే.. ఇప్పుడు సమ్మె చేపడుతున్న యూనియన్ నాయకులే బాధ్యులని వ్యాఖ్యానించారు. యూనియన్ ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, కార్మికులంతా దీనిని గుర్తించాలని సూచించారు. ఇప్పటికే జీతాలు ఎక్కువ! ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోల్చి చూస్తే.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు లెక్కతేల్చారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘డ్రైవర్ల వేతనం అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. కండక్టర్, మెకానిక్, శ్రామిక్‌ల జీతాలు కూడా టీఎస్ఆర్టీసీలో ఎక్కువే. కర్ణాటకలో సగటున ప్రతి 4.6 మంది కార్మికులకు ఒక బస్సు చొప్పున నడుపుతుండగా.. టీఎస్ ఆర్టీసీలో సగటున ప్రతి 5.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుస్తున్నాయి. కర్ణాటక ఆర్టీసీ విధానాలను ఇక్కడ అవలంబిస్తే (ఆ మేర ఉద్యోగులను తగ్గిస్తే) నష్టాలు రూ.600 కోట్లు తగ్గుతాయి. ఆర్టీసీ నష్టాల్లో ముఖ్యమైన కారణం అధిక జీతభత్యాలు, అధిక సిబ్బంది. కార్మికులు, యాజమాన్యం కలసి ఈ విషయాలు చర్చించుకోవాల్సి ఉంది. కర్ణాటకలో 226 డిపోలతో విజయవంతంగా నడపగలుగుతున్నా.. అందులో మూడోవంతు అంటే 97 డిపోలే ఉన్నా లాభాల్లో ఉండలేకపోతున్నాం. గతంలో ఆర్టీసీ లాభాల్లో నడిపినప్పుడు కూడా ఇంత తెలివి తక్కువ, అసంజమైన డిమాండ్లు ఎప్పుడూ తేలేదు..’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 2,200 అద్దె బస్సులతోపాటు అదనంగా బస్సులు నడిపే ఇతర సంస్థల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సాయం తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు డ్రైవర్లు, పదవీ విరమణ చేసిన డ్రైవర్ల సేవలను తీసుకోవాలన్నారు. ఒకసారి సమ్మె మొదలై బస్సులు నడవకపోతే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని.. ప్రైవేటు వాహనాలు మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. ఇలా మార్కెట్లోకి వచ్చిన ప్రైవేటు వాహనాలు తిరిగి వెనక్కి వెళ్లడం కష్టమని, ఒక విధంగా ప్రైవేటు వాహనాలు పెరగడానికి ఆర్టీసీ యానియన్ చర్యలే కారణమవుతాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, శాంతి కుమారి, రాజశేఖర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
సంచార వైద్యంపై సమ్మెట
మారుమూల గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 104 సంచార వాహన సేవలు కుంటుపడుతున్నాయి. వైఎస్ మరణానంతరం వాటి నిర్వహణను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రజలకు నేరుగా లబ్ధిచేకూర్చే ఒక్కో పథకాన్ని, ప్రభుత్వ సేవలను నీరుగారుస్తున్న చంద్రబాబు సర్కారు ‘104’ నిర్వహణనూ గాలికొదిలేసింది. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాక సిబ్బంది చివరకు సమ్మెబాట పట్టారు. ఒంగోలు సెంట్రల్ : పల్లెల్లో వైద్య సేవలు కొరవడ్డాయి. దీంతో గ్రామీణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పల్లెల్లో వైద్య సేవలందించే చంద్రన్న సంచార వైద్య సేవ సిబ్బంది వారం రోజులుగా సమ్మె చేçస్తుండటంతో గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. 104 సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పిరమిల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు సమ్మెను పట్టించుకోవడం లేదు. పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలన్నది ఈ పథకం ముఖ్య లక్ష్యం. తొలి నాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన సేవలందించిన 104 వాహనాలు మహానేత మరణానంతరం ఒడిదొడుకులు మొదలయ్యాయి. 104 వాహనాల ద్వారా అందే సేవలివీ.. గ్రామాల్లో 104 వాహనాల ద్వారా బీపీ, షుగర్, ఫిట్స్, ఉబ్బసం, గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమైన మందులతో వైద్యసేవలను అందిస్తారు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు రక్త పరీక్షలను నిర్వహిస్తారు. అనంతరం మందులు అందిస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 20 సంచార వైద్య వాహనాలు ఉండగా వాటిలో 20 మంది ఫార్మసిస్టులు, 20 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 21 మంది స్టాఫ్ నర్సులు, 20 మంది సెక్యూరిటీ గార్డ్లు, 20 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 70 సంవత్సరాలు దాటిన వైద్యులు ఐదుగురు ఉన్నారు. ఒక్కో విభాగంలో మరో నలుగురు రిజర్వ్‌లో ఉండాలి. అయితే రిజర్వ్‌లో ఉండాల్సిన సిబ్బంది లేరు. చాలా వాహనాల్లో వైద్యులు లేకుండానే వైద్య సేవలను కానిచ్చేస్తున్నారు. ఏ ఒక్క వైద్యుడు సెలవు పెట్టినా గ్రామాల్లో 104 వాహనాల ద్వారా వైద్యసేవలు అందవు. అజమాయిషీ అంతా ప్రైవేటు సంస్థదే.. మందుల కొరత, చేయని పరీక్షలతో అరకొరగానే 104 వైద్యసేవలు అందుతున్నాయి. పైగా ప్రభుత్వం నుంచి పిరమిల్ అనే ప్రైవేటు సంస్థకు ఈ సేవలను అప్పగించడంతో పూర్తి స్థాయిలో పథకం పని చేయడం లేదు. దీంతో సదరు సంస్థ తన ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోంది. 104 వాహనాలపై వైద్యశాఖ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో అధికారాలు లేవు. దీంతో సంస్థ పాడిందే పాటగా, చేసిందే వైద్యంగా మారింది. ప్రస్తుతం సిబ్బంది ఎలాపోతే మాకేం అన్నట్లుగా సంస్థ వ్యవహరిస్తుండటంతో వారు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 104 వాహనానికి ఫిట్నెస్ లేకపోవడంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న స్టాప్‌నర్సు, మరొక సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. స్టాఫ్ నర్సు నిండు గర్భిణి. సంస్థలో పని చేసే సిబ్బందికి మెటర్నిటీ సెలవులు లేకపోవడంతో నిండు గర్భిణి అయి ఉండి కూడా విధుల్లో కొనసాగాల్సి వచ్చింది. అదే విధంగా వాహనానికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా లేకపోవడంతో బీమా సొమ్ము వచ్చే అవకాశం లేదు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగితే అంతే దురదృష్టవశాత్తు 104 వాహనానికి ప్రమాదం జరిగితే అంతే సంగతులు. చంద్రన్న సంచార వాహనాలకు ఫిట్నెస్ గానీ, బీమా, ట్యాక్స్‌లను పిరమిల్ సంస్థ చేయించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 వాహనాలకు ఫిట్నెస్ రూపంలోనే ప్రభుత్వానికి గత రెండు సంవత్సరాలలో లక్షల రూపాయలను సంస్థ ఎగ్గొట్టింది. చంద్రన్న సంచార చికిత్స వాహనాలు కేవలం చంద్రన్న సంచార వాహనాలుగానే మిగిలిపోతున్నాయి. వేతనాలు పెంచాలి పదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నా ఇంత వరకూ వేతనాలు పెంచలేదు. 151 జిఓ ప్రకారం సిబ్బంది వేతనాలు చెల్లించాలి. అన్ని వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్సు, కల్పించాలి. – కె.హనుమంతురావు, 104 చంద్రన్న సంచార వైద్య సేవ సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చంద్రన్న సంచార వైద్య సేవ వాహనాలను ప్రభుత్వమే నిర్వహించాలి. వివిధ డిమాండ్లతో వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పైగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం, పిరమిల్ సంస్థలు పరిష్కరించాలి. – కె.సురేంద్రబాబు, యూనియన్ కార్యదర్శి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం 104 సిబ్బంది సమ్మె నేపథ్యంలో పిరమిల్ సంస్థ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, వైద్యులకు సహాయ పడుతున్నారు. – డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
సమ్మెకు సైరన్
జాతీయ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. నాలుగ సంఘాలు ఏకమై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆందోళనబాట పట్టాయి. గుర్తింపు సంఘం ఎన్నికల ముందు, తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు పోరుసల్పాలని పిలుపునిచ్చాయి. ఐదు రోజుల క్రితం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ సీఎండీ ఎన్ శ్రీధర్‌కు సమ్మె నోటీసు అందించాయి. మరో రెండు రోజుల్లో ఆర్ఎల్సీకి కూడా నోటీస్ ఇవ్వనున్నాయి. శ్రీరాంపూర్(మంచిర్యాల జిల్లా) : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 14న ఒక రోజు టోకెన్ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు రెండోసారి టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఎన్నికల ముందు సెప్టెంబర్ 29న, ఎన్నికలు తరువాత అక్టోబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికలు ముగిసి ఇప్పటి 3 నెలలవుతున్నా అమలు చేయడంలేదు. దీంతో కార్మిక నేతలకు ఆందోళనకు దిగుతున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సమ్మెకు పిలుపునివ్వగా మరో జాతీయ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ సమ్మెకు దూరంగా ఉంది. 25 నుంచి కంపెనీ వ్యాప్తంగా రిలే దీక్షలు.. సమ్మె విజయవంతానికి జాతీయ సంఘాలు ఈ నెల 25 నుంచి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంల కార్యాలయాల ముందు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అన్ని ఏరియాలకు తిరుగుతూ ప్రెస్మీట్లు పెడుతూ, సమావేశాలు నిర్వహిస్తూ సమ్మెకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. మౌన ముద్రలో టీబీజీకేఎస్ నేతలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినా టీబీజీకేఎస్‌లో ఇంకా అనిశ్చితి వీడలేదు. కమిటీలు లేక, గుర్తింపు పత్రం తీసుకోక, అధికారంలో ఉన్నామా లేమా అన్న చందంగా నేతలు మౌన ముద్రలో ఉండిపోయారు. కమిటీల ప్రకటన చేసే వరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని, కార్యక్రమాలు చేపట్టొద్దని అధిష్ఠానవర్గం నుంచి ఆదేశాలు ఉండటంతో యూనియన్ ముఖ్య నాయకులు కిమ్మనకుండా చూçస్తూ ఉన్నారు. కమిటీల్లో జాప్యం వల్ల నేతలు అసహనం పెరగడమే కాకుండా, ప్రతిపక్ష సంఘాలు చేసే ఆందోళన కార్యక్రమాలను ప్రతిఘటించడానికి అధిష్ఠానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప స్పందించే పరిస్థితి లేదు. ప్రధానంగా కారుణ్య నియామకాలు జాప్యం జరుగడంతో టీబీజీకేఎస్ నేతలే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గెలిచినా కార్మికులవద్దకు వెళ్లలేని పరిస్థితి ఉం దని కొందరు నేతలు వాపోతున్నారు. ఎన్నికలు జరిగిన 3 నెలలకే సమ్మె చేయడం.. రాజకీయ లబ్ధికోసమేనని టీబీజీకేఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే క్వార్టర్లకు ఏసీలు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఇంకా ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఉత్తర్వులు ఇచ్చిన కూడా సమ్మెకు పిలుపునివ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. టోకెన్ సమ్మె డిమాండ్లు కారుణ్య నియామకాల పేరుతో ఇస్తామన్నా వారసత్వ ఉద్యోగాలకు వెంటనే ఇవ్వాలి కార్మికులకు సొంతింటికి స్థలం, వసతులతో పాటు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి మారుపేర్లతో పని చేసే వారిని రెగ్యులరైజ్ చేయాలి క్వార్టర్లకు ఏసీ పెట్టుకునేందుకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయి. వీటిని మార్చాలి 10 వేజ్‌బోర్డు బ్యాలెన్స్ ఎరియర్స్, ఇందులో సింగరేణిలో అమలు కాని ఒప్పందాలను అమ లు చేయాలి ఎల్టీసీ, ఎల్ఎల్టీసీలకు లీవులు పెట్టుకోకుండానే డబ్బులు చెల్లించాలి కొత్తగా 6 భూగర్భ గనులు తవ్వాలి వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఇంకా ఇతర డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. -
అయిజ ఎంపీపీ ఆమరణ నిరాహార దీక్ష
గద్వాల : గద్వాల జిల్లా కోసం అయిజ ఎంపీపీ సుందర్రాజ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో ఆయన దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అయిజ మాజీ జెడ్పీటీసీ తిరుమల్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్పర్సన్ రాజేశ్వరి, గద్వాల ఎంపీపీ సుభాన్, మల్దకల్ ఎంపీపీ సవారమ్మ, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సంఘీభావం తెలిపారు. తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ ప్రజల ఆకాంక్ష గద్వాల జిల్లా అని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయిజ నగర పంచాయితీ చైర్పర్సన్ రాజేశ్వరి మాట్లాడుతూ గద్వాల జిల్లా కోసం తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గద్వాల ఎంపీపీ సుభాన్ మాట్లాడుతూ గద్వాల జిల్లా ఆకాంక్షను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. పట్టణంలో ర్యాలీ గద్వాల జిల్లా కోరుతూ అయిజ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ కొనసాగించారు. జై గద్వాల నినాదాలతో హోరెత్తించారు. డప్పులతో గద్వాల జిల్లా ఆకాంక్షను చాటి చెప్పారు. అనంతరం దీక్షా శిబిరానికి చేరుకొని ఎంపీపీ సుందర్రాజుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన పాటలు ఆకట్టుకున్నాయి. -
కార్మికుల అణచివేత విధానాలు తగదు
సత్తెనపల్లి (గుంటూరు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణచివేయడానికి నిరంకుశ పద్ధతులు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి విమర్శించారు. సెప్టెంబరు 2న 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ స్థానిక ఎన్జీవో హోమ్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈసదస్సుకు సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షత వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ 2015లో కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా 12 డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ధరలు పెరుగుతున్నా ప్రధాని మోదీ నుంచి స్పందన కరువైందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సమ్మెలు, ధర్నాలు సహించనని కఠినంగా అణచివేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. కార్మికులను ఎటువంటి బలప్రయోగాల ద్వారా అణచలేరని, ఈ సమ్మె ద్వారా కార్మికుల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.వి.కె.సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలకు కార్మికుల గోడు వినిపించడం లేదన్నారు. తప్పని పరిస్థితుల్లోనే సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలన్ని సమ్మెకు సన్నద్ధమయ్యాయని చెప్పారు. కార్మికుల సహనాన్ని చేతకాని తనంగా చూడొద్దని హెచ్చరించారు. సదస్సులో ఐఎన్టీయూసీ ప్రతినిధి మాదంశెట్టి వేదాద్రి, వైఎస్సార్‌టీయూ ప్రతినిధి గరికపాటి ప్రభాకరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు, సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఆంజనేయులు నాయక్, గుంటూరు మల్లేశ్వరి, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పొత్తూరి రామకోటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి అవ్వారు ప్రసాదరావు, ముఠా వర్కర్స్ అధ్యక్షుడు తోటా పుష్పరాజ్, ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్.కె.సుభాని, ఆటో వర్కర్ యూనియన్ నాయకులు డీఆర్ మస్తాన్, ఎం.హరిపోతురాజు, వంకాయలపాటి ప్రభాకరరావు మాట్లాడారు. సదస్సులో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
నదీ జలాలను శుద్ధి చేయాలని మౌనదీక్ష
కాళేశ్వరం : గోదావరి, కృష్ణా నదీ జాలాలను శుద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 25 వరకు కాళేశ్వరంలో మౌనదీక్ష చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన గాదెపాక రాములుస్వామి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం గోదావరి వద్ద విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలంతోపాటు ఇతర పుణ్యక్షేత్రాల్లోని నదులు మలినాలు, వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి నదీ జలాలను శుద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో జలాలు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
విద్యుత్ శాఖపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో పంపిణీ, సరఫరా నష్టాలను 12 నుంచి 6 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ఏపీలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెలో 15వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమాన పనికి... సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఎట్టకేలకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాలతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించుకున్నారు. దాంతో 64 రోజుల సమ్మెకు తెర పడింది. కోర్టు ఆదేశాలను గౌరమిస్తూ సమ్మెను విరమించినట్లు జూడాలు తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఇవాళ నుంచే విధులకు హాజరు కానున్నారు. జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా జూడాలు బహిష్కరించటంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఏపీలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. సాధారణ సేవలు నిలిపేస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలన్న నిబంధనపై నిరసనగా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో నిన్న జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సంవత్సరం పాటు వైద్య సేవలందించాలనే నిబంధనను తొలగించాలని పట్టుపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దాంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. మరోవైపు తెలంగాణలోనూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమించాలని హైకోర్టు సూచించినా వారు తమ పట్టు వీడలేదు. -
జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
-
జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని న్యాయస్థానం మరోసారి జూడాలకు స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, జూనియర్ డాక్టర్ల వాదనలతో తాము ఏకీభవించటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.. జూనియర్ డాక్టర్లు ఇంకా పరిణితి చెందాల్సి ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కాగా సమ్మె కొనసాగించేందుకే జూనియర్ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని జూడాల తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. -
రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా
వేలూరు: ముకుందరాయపురంలోని సిప్కాట్లో ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాణిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమిలనాడు వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి దయానిధి మాట్లాడుతూ సిప్కాట్లో ఫ్యాక్టరీల కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని యజమానులు తెలిపారని పేర్కొన్నారు. ఇప్పుడు వారి గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశను మిగల్చడం సరికాదన్నారు. భూమి కోల్పోయిన రైతుల వారసులకు అర్హత ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాశీనాథన్, అధ్యక్షులు రామచంద్రన్, తాలూకా కార్యదర్శి వెంకటేశన్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బంక్‌లు బంద్
జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగా రు. ఫలితంగా జిల్లాలోని 220 బంకులు నిరవధికంగా మూతపడ్డాయి. వీరి ఆందోళన ఫలితంగా లక్షలాది వాహనాల చోదకులకు అవస్థలు మొదలయ్యాయి. తూనికలు కొలతల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం బంకులపై దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్నవాటిని సీజ్ చేస్తుండటం, లక్షలాది రూపాయలు అపరాధరుసుం వసూలు చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంకుల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. ఈ సందర్బంగా గుంటూరులోని లాడ్జిసెంటర్లోగల బంకు యజమానుల యూనియన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం యూనియన్ జిల్లా అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తూనికలు, కొలతల శాఖ అధికారుల మొండివైఖరివల్లే తాము సమ్మె చేపట్టామని వెల్లడించారు. పదేళ్లుగా ఆయిల్ కంపెనీలే బంకులకు పంపులను సరఫరా చేసేవారనీ, వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసిన తరువాతనే వినియోగించేవారమని తెలిపారు. కానీ అర్ధంతరంగా చమురు కంపెనీలు, పంపుల తయారీ కంపెనీలతో తలెత్తిన మనస్పర్థల కారణంగా బంకుల్లో వినియోగిస్తున్న పంపుల్లో తప్పులున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏటా అధికారులు తనిఖీలు నిర్వహించి, పంపులపై ముద్రలు వేస్తారని ఇప్పుడు ఆ విధానానికి స్వస్తిపలికి ఏకంగా అక్రమాలు జరిగాయం టూ లక్షలాది రూపాయలు జరిమానా విధించడం సరికాదని పేర్కొన్నారు. డ్రైస్వైన్ కంపెనీకి చెందిన పంపులు వినియోగించుకోవచ్చని గతంలో తూనికలు కొలతల శాఖ అమోదించిందనీ, ఇప్పుడు దానినీ అనుమానిస్తోందని చెప్పారు. ఒక పంపు ఏర్పాటు చేయాలంటే వ్యయం లక్షల్లో ఉంటుందని, ఏర్పాటు చేయటానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందన్నారు. పంపుల తయారీ కంపెనీలతో వివాదం వల్ల బంకులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 9లక్షల లీటర్ల పెట్రోలు, 27లక్షల లీటర్ల డీజిల్ వినియోగదారులకు అందిస్తున్నామనీ, బంకులు నిలుపుదల చేయటం వల్ల ప్రజల్లో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేసి రాతపూర్వకంగా పంపులు వినియోగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసే వరకూ సమ్మెద్వారా నిరసన తెలుపుతామన్నారు. -
తిరువూరులో పడకేసిన పారిశుద్ధ్యం
కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె తో తిరువూరులో గత మూడురోజులుగా పారి శుధ్య పనులు అరకొరగా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీధు ల్లో చెత్తాచెదారం తొలగించక, మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నగరపంచాయతీలో 35 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుండగా, 14 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అసలే చాలీచాలని పారిశుద్ధ్య సిబ్బందితో పట్టణంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కార్మికుల సమ్మెతో పరిస్థితి మరింత దిగజారింది. నగరపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కుండీలలో చెత్త పేరుకుపోయి, వీధుల్లో చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశుధ్య లేమితో పట్టణంలో దోమల బెడద తీవ్రతరమైంది. రాత్రివేళల్లో దోమకాటుకు గురై పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో చెత్తతొలగింపులో ఇబ్బంది కలుగుతోందని నగరపంచాయతీ కమిషనర్ మల్లేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.