ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో పంపిణీ, సరఫరా నష్టాలను 12 నుంచి 6 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మరోవైపు ఏపీలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెలో 15వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమాన పనికి... సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేశారు.