కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె తో తిరువూరులో గత మూడురోజులుగా పారి శుధ్య పనులు అరకొరగా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీధు ల్లో చెత్తాచెదారం తొలగించక, మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నగరపంచాయతీలో 35 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులుండగా, 14 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అసలే చాలీచాలని పారిశుద్ధ్య సిబ్బందితో పట్టణంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కార్మికుల సమ్మెతో పరిస్థితి మరింత దిగజారింది.
నగరపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కుండీలలో చెత్త పేరుకుపోయి, వీధుల్లో చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశుధ్య లేమితో పట్టణంలో దోమల బెడద తీవ్రతరమైంది. రాత్రివేళల్లో దోమకాటుకు గురై పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో చెత్తతొలగింపులో ఇబ్బంది కలుగుతోందని నగరపంచాయతీ కమిషనర్ మల్లేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
తిరువూరులో పడకేసిన పారిశుద్ధ్యం
Published Tue, Feb 11 2014 5:54 PM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement