సాక్షి, హైదరాబాద్: ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె ఊపందుకుంది. మంత్రి కామినేని శ్రీని వాస్ వైఖరికి నిరసనగా బుధవారం నుంచి తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల కూ గైర్హాజరవుతామని జూడాల నాయకులు తెలి పారు. గుంటూరులో సీనియర్ రెసిడెంట్లు విధు లు బహిష్కరించారు. జూడాల సమ్మెతో వైద్య కళాశాలలు, వాటికి అనుబంధ పెద్దాసుపత్రులన్నింటిలో సాధారణ సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రభుత్వం, జూడాల మధ్య ఇప్పటివరకూ చర్చలు సఫలం కాలేదు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు చెయ్యకపోతే ఒప్పుకునేది లేద ని ప్రభుత్వం పట్టుబడుతోంది.
ప్రభుత్వ సర్వీసు చేయకపోతే భారతీయ వైద్యమండలిలో రిజిస్ట్రేషన్ ఆపేస్తామనడం నిబంధనలకు విరుద్ధమని జూడాలు చెబుతున్నారు. త్వరలోనే అత్యవసర సేవలు నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నామని వైద్యవిద్యా సంచాలకులు శాంతారావు జాడాలను కోరారు. కోర్టు తీర్పు వచ్చాక ఏం చేయాలన్నది ఆలోచిస్తామన్నారు.