ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారం అయిదవ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని జూడాలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుధవారం విజయవాడ నగరంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట జూడాలు స్వచ్ఛభారత్ భారత్ నిర్వహించారు. ప్రభుత్వం పిలిస్తే తమ డిమాండ్లపై మరోసారి చర్చకు సిద్ధమని తెలిపారు. అయితే రాష్ట్రంలోని అత్యవసర సేవలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జూడాలు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వలేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థి ఏడాది పాటు గ్రామాల్లో పని చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జూడాలు సమ్మెకు దిగారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో జూడాలు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో జూడాలు సమ్మెకు దిగారు.