( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ డాకర్టకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనందించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్‌లో పెంపుదల ఉంటుందని వెల్లడించింది.
ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44,075 నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524 నుంచి రూ.53,503కు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు పెంచింది. స్టైఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: విశాఖ కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment