సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల (జూడాల)పై ప్రభుత్వం కరుణ చూపింది. వారి ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. జూడాలతో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ శనివారం చర్చలు జరిపారు. అయితే ఏడాదిపాటు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలన్న నిబంధనను తొలగించాలన్న డిమాండ్‌ను మాత్రం తిరస్కరించారు.
ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు అనంతరమే నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఉద్యోగుల విభజన పూర్తయ్యాక వాటిని భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, పీజీ చదివే వారికి స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలన్న డిమాండ్‌ను, అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్‌ను అంగీకరించింది. అలాగే బోధనాసుపత్రుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జూడాల నాలుగు డిమాండ్లకు సర్కారు ఓకే
Published Sun, Dec 21 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement