suresh chandra
-
కరోనాతో సీనియర్ నటుడు కన్నుమూత
బెంగళూరు: కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో కన్నుమూశారు. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కోవిడ్ సోకగా.. ఆసుపత్రిలో చేర్చారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కానీ వైద్యానికి సరిగా స్పందించకపోవడంతో మరణించారు. కాగా సురేశ్ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు 50 వరకు కన్నడ చిత్రాల్లో నటించారు. సురేష్ నటించిన చెలువినా చిత్తారా, ఉగ్రమ్ సినిమాలోని పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. వీటితోపాటు కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించారు. సాధారణంగా సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్ల పాత్రకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అతను చివరిసారిగా 2019లో కాళిదాస కన్నడ మేష్త్రు అనే చిత్రంలో కనిపించారు. చదవండి: అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో -
ఎన్ఎంసీ తొలి చీఫ్‌గా సురేశ్
న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు తొలి చీఫ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మను ఎన్ఎంసీ చైర్మన్‌గా నియమించింది. నియామకాల కేబినెట్ కమిటీ శర్మ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు. సంబంధిత విధి నిర్వహణ కోసం ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఎన్ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు. -
సీఐసీలోకి నలుగురు కొత్త కమిషనర్లు
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌లో మొత్తం ఉండాల్సిన కమిషనర్ల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ) సహా ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. సిన్హా 1981 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి) సీఐసీలోని ఏకైక మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. గుప్తా 1982 ఐఏఎస్ అధికారి కాగా, సురేశ్ చంద్ర ఈ ఏడాదే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 2002–04 మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రైవేట్ సెక్రటరీగా కూడా చంద్ర ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు(బ్యూరొక్రాట్స్) కాకుండా.. లా, సైన్స్, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం తదితర రంగాల్లోని నిపుణులకు(నాన్ బ్యూరొక్రాట్స్) కమిషనర్లుగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 12(5)ని ఉటంకిస్తూ మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు విజ్ఞప్తిని తాజా నియామకాల్లో కేంద్రం పట్టించుకోలేదు. -
కేంద్ర మంత్రి లంచం తీసుకున్నారు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు. అజిత్ దోవల్ అడ్డుకున్నారు.. రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు. కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్ఎస్ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు. సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు. కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ.. సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చౌదరిని సతీశ్ కలిశాడు అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు. -
జూడాల నాలుగు డిమాండ్లకు సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల (జూడాల)పై ప్రభుత్వం కరుణ చూపింది. వారి ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. జూడాలతో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ శనివారం చర్చలు జరిపారు. అయితే ఏడాదిపాటు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలన్న నిబంధనను తొలగించాలన్న డిమాండ్‌ను మాత్రం తిరస్కరించారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు అనంతరమే నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఉద్యోగుల విభజన పూర్తయ్యాక వాటిని భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, పీజీ చదివే వారికి స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలన్న డిమాండ్‌ను, అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్‌ను అంగీకరించింది. అలాగే బోధనాసుపత్రుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
‘ఉపాధి’ ఈసీ బలవన్మరణం
డిండి, న్యూస్‌లైన్: ఉపాధిహామీ పథకం డిండి మండల ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) మేకల సురేష్‌చంద్ర (25) బుధవారం రాత్రి కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడుకు చెందిన మేకల సత్యనారాయణ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. వారిలో సురేష్‌చంద్ర చిన్నవాడు. మూడున్నరేళ్లుగా మండలంలో ఉపాధిహామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జూలై నుంచి ఏపీఓగా ఇన్చార్జ్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నెల రోజులుగా కార్యాలయంలో ఉన్న స్త్రీశక్తి భవనంలో రాత్రిళ్లు షల్టర్ తీసుకుంటున్నాడు. అంతకుముందు దేవరకొండలో నివాసం ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇతను మృధుస్వభావి అని తెలిసింది. గత నెలలో దేవరకొండలో ఇంజినీరింగ్ విద్యార్థిని హత్యకు పాల్పడిన వ్యక్తి పక్కరూంలో ఉండేవాడు. హత్య జరగడంతో భయానికి లోనై డిండిలో ఉండేందుకు రూం కోసం వెతకగా దొరకలేదు. దీంతో నెల రోజులుగా రాత్రివేళ కార్యాలయంలోనే ఉంటున్నాడు. గురువారం ఉదయం 10గంటలకు కార్యాల యానికి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ గదికి లోపలవైపు గడియవేసి ఉండడంతో ఎవరైనా ఉన్నారేమోనని పిలిచారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఉప సర్పంచ్ లక్ష్మయ్య సమక్షంలో తలుపులను గట్టిగా తోయడంతో లోపలిగడియ ఊడి తెరుచుకున్నాయి. ఎదురుగా సీలింగ్‌ఫ్యాన్‌కు వేలాడుతున్న సురేష్‌చంద్ర మృతదేహం కనిపించింది. మృతుడికి ఈ మధ్యనే వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చేనెల 27న వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. కాగా, సురేష్‌చంద్ర రెండు పేజీల సూసైడ్ నోట్ ఇంగ్లిష్‌లో రాసి పెట్టాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీలుంటే నా కళ్లను దానం చేయండి ‘‘నన్ను రక్షించకండి, చనిపోనివ్వండి. వీలుంటే నా కళ్లను దానం చేయండి. నా కోసం ఎవరూ ఏడ్వవద్దు. నాకు వివాహ నిశ్చయం జరిగింది. ఆ అమ్మాయి నన్ను క్షమించాలి’ అని సూసైడ్ నోట్లో కోరాడు. అమ్మ, నాన్న, అన్న, వదిన, అక్క, బావ, స్నేహితులు, తోటి సహ ఉద్యోగులను పేరుపేరున గుర్తు చేసుకుని సారీ తెలిపాడు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరూ మంచిగా సహకరించారు. జిల్లా కలెక్టర్ చాలా మంచివాడు. పేద ప్రజలకు ఆయన చేస్తున్న సహాయ పనులను అభినందిస్తున్నా. కానీ ఆయన మున్ముందు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నాను. నా చివరిరోజు సంతోషంగా గడిపాను’ అని నోట్లో రాసి ఉంది.