స్వైన్ ఫ్లూ..ఈ పేరు చెబితే చాలు, ఇప్పటివరకు సామాన్య ప్రజలే వణికి పోయేవారు. ఇప్పుడు ఆ వంతు డాక్టర్లకు కూడా వచ్చింది. వ్యాధిని నివారించాల్సిన డాక్టర్లే ఇప్పుడు వ్యాధి బారిన పడ్డారు. దీనికి నిదర్శనమే ఈ ఉదంతం.. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకింది.
ఎన్ 95 మాస్కులు సప్లై ఆగిపోయినందువల్లే స్వైన్ ఫ్లూ సోకిందని గురువారం ఉస్మానియా అస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. ఎన్95 మాస్కులను అన్ని వార్డుల్లో పనిచేసే జూడాలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.