సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా ఫీజులు పెంచారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. 2017లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని.. పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నించారు. తక్షణమే జీవో 28 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment