ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ బిల్లు (ఎన్‌ఎంసీ)–2019కి వ్యతిరేకంగా తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకు 24 గంటలపాటు బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయా బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదేశించారు.
ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ మెడికల్ బిల్లు వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని జూడాలు పేర్కొంటున్న విషయం విదితమే. దీనిపై ఢిల్లీలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లోనూ జూడాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment