రెండో రోజు జూనియర్‌ డాక్టర్ల ఆందోళన | Junior Doctors Protest Continue in Osmania | Sakshi
Sakshi News home page

రెండో రోజు జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

Published Tue, Aug 1 2017 12:21 PM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM

Junior Doctors Protest Continue in Osmania

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు తమ ఆందోళనను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. రోగి బంధువులు ఆదివారం రాత్రి ఓ జూనియర్‌ డాక్టర్‌పై దాడి చేశారంటూ జూనియర్‌ వైద్యులు సోమవారం ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వారితో సోమవారం చర్చలు జరిపినప్పటికీ జూనియర్‌ డాక్టర్లు తమ పట్టు వదల్లేదు. దీంతో వారి డిమాండ్లపై కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురువారం వచ్చే అవకాశముండగా.. నివేదికలోని అంశాలను చూసిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు అభిషేక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement