డాక్టర్..పేషెంట్..మధ్యలో పోలీస్
హైదరాబాద్: ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో పోలీసు పహార మధ్య వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నలుగురు జూనియర్ వైద్యులపై దాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం ఆసుపత్రిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం జూనియర్ డాక్టరుపై ఓ రోగి బంధువులు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సేవలను నిలిపివేయడంతో ఐపీ, ఓపీ, కులీకుత్‌భ్‌షా ఇలా అన్ని భవనాలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా తమకు రక్షణ కల్పించాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో చర్చలు సఫలమవడంతో బుధవారం జూడాలు సమ్మె విరమించి వైద్య సేవలు ప్రారంభించారు.