
40 మంది వైద్య విద్యార్థులు కూడా..
కరీంనగర్: నేపాల్ భూకంపంలో ఖట్మాండూకు 16 కిలోమీటర్ల దూరంలోని భరత్‌పూర్ కాళిదాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న 40 మంది తెలుగు రాష్ట్రాల జూనియర్ వైద్యులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కరీంనగర్ సమీపంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన సందీప్‌రెడ్డి ఉన్నాడు. సందీప్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భూకంపం వచ్చిన సమయంలో కళాశాల లోపలే ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు.
తాను సురక్షితంగా ఉన్నానని, రాత్రి వరకు రోడ్డుపైనే ఉన్నామని సందీప్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. విద్యార్థులంతా భరత్‌పూర్ సమీపంలోని ఓ ఆలయంలో తలదాచుకున్నట్టు తెలిపాడు. కాగా, తమ కుమారుడితోపాటు మిగతావారినీ క్షేమంగా స్వస్థలానికి రప్పించాలని సందీప్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.