ఫైటర్‌ పైలట్‌ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక | Gurukul Student Selection For Fighter Pilot Course | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ పైలట్‌ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక

Published Sat, Feb 12 2022 1:40 PM | Last Updated on Sat, Feb 12 2022 2:38 PM

Gurukul Student Selection For Fighter Pilot Course - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌ కోర్సుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) విద్యార్థి అశోక్‌ సాయి ఎంపికయ్యాడు. కరీంనగర్‌ జిల్లాలోని రుక్మాపూర్‌  సైనిక గురుకుల పాఠశాలలో అశోక్‌ సాయి చదివాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి అతని స్వగ్రామం. అశోక్‌ తండ్రి వికలాంగుడు.

కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కుటుంబం నుంచి వచ్చి  ఫైటర్‌ పైలట్‌ కోర్సుకు ఎంపిక కావడం పట్ల అశోక్‌సాయి, అతని తల్లిదండ్రులు సంతోషంవ్యక్తంచేశారు. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పందిస్తూ  పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఫైటర్‌ పైలట్‌  కోర్సుకు ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement