ఏడీసెట్‌–2024 రద్దు | Direct admissions to YSR AFU | Sakshi
Sakshi News home page

ఏడీసెట్‌–2024 రద్దు

Published Sat, Jun 8 2024 5:32 AM | Last Updated on Sat, Jun 8 2024 5:32 AM

Direct admissions to YSR AFU

ఇక వైఎస్సార్‌ ఏఎఫ్‌యూలో నేరుగా ప్రవేశాలు  

ఏఎఫ్‌యూ: వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సి ఉన్న ఏడీసెట్‌–2024 (ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏడీసెట్‌–24 చైర్మన్‌ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్, కన్వీనర్‌ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వర్సిటీలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్స్‌లో భాగంగా పెయింటింగ్, యానిమేషన్, అప్‌లైడ్‌ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, బి.డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. 

దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు తగినంత సమయం ఇచ్చామన్నారు. కొన్ని విభాగాల్లో ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏడీసెట్‌–24ని రద్దు చేసి, డైరెక్ట్‌ అడ్మిషన్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయాన్ని ఏపీ ఉన్నతవిద్యామండలి దృష్టికి తీసుకువెళ్లగా ఏడీసెట్‌–24ని రద్దుచేసేందుకు అనుమతించారన్నారు. 

దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వారి అర్హత మార్కులు (ఇంటర్‌/డిప్లొమా), రోస్టర్, మెరిట్‌ ఆధారంగా నేరుగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును వచ్చేవారంలో విడుదల చేసి పదిరోజుల్లోపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఏడీసెట్‌–24కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యరి్థకి సంబంధిత సమాచారాన్ని ఫోన్‌ ద్వారా, పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement