ఆర్‌యూలో మరో కొత్త కోర్సు
Published Tue, Mar 14 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్న 15 కోర్సులతో పాటు మరో కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్ తెలిపారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ఖనిజాల గనిగా పేరుగాంచిందని ఈ నేపథ్యంలో మైనింగ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశలు అందిపుచ్చుకునేందుకు ఎర్త్ సైన్స్(భూ ఖనిజ శాస్త్రం) అనే కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సున్నపురాయి, ఇనుము, యురేనియం, వజ్రాలు, బంగారం తదితర ఖనిజాల వెలికితీతలో మైనింగ్, కార్పొరేట్ కంపెనీలు ఎర్త్సైన్్స పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఈకోర్సుకు సైన్స్ లేదా మ్యాథ్స్ చదివిన డిగ్రీ విద్యార్థులు అర్హులు అని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా పరిగణించి ఫీజు నిర్ణయిస్తామని, ఇందులో మొత్తం 30 సీట్లు ఉంటాయని వెల్లడించారు.
Advertisement