హైటెక్ కెరీర్‌కు.. బీటెక్
ఇంజనీరింగ్ స్పెషల్
ఇంజనీరింగ్ ప్రస్తుతం క్రేజ్ ఉన్న కోర్సు. ఇంటర్ పూర్తిచేసిన వారిలో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటారు. కానీ వారికి కోర్సు, కాలేజీ ఎంపిక, అందులో ఉన్న కష్టనష్టాలు, నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టత అవగాహన కల్పించేందుకు ఈ కథనం.
ప్రవేశ పరీక్షలు
ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకుంటే ఐఐటీ-జేఈఈ, బిట్ శాట్...వంటి ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోవాలి. స్థానిక కాలేజీల్లో చేరాలనుకున్న వారు ఎంసెట్ రాయడం ఉత్తమం.
బ్రాంచ్ ఎంపికలో జాగ్రత్త
పూర్వ విద్యార్థులు, పెద్దల సలహా తీసుకుని మనకిష్టమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తరువాత వేరే ఆలోచన లేకుండా దాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి.
కాలేజీ ఎంపిక ఇలా...
కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీ(అనుభవం, అర్హతలు), అక్రిడేషన్స్(నాక్, ఎన్‌బీఏ), పూర్వ విద్యార్థుల ప్రతిభ, కాలేజీ ఉన్న ప్రాంతం, ప్లేస్‌మెంట్ సెల్, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం, క్లోజింగ్ ర్యాంక్స్, క్యాంపస్, హాస్టల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.* బీటెక్ తర్వాత విద్యార్థుల ముందున్న అవకాశాలు..
* ఇండియాలో ఉన్నత విద్య చదవాలనుకున్నవారు ఎంటెక్, ఎంఈ చేయవచ్చు.
* విదేశాల్లో పీజీ చేయాలనుకుంటే..టోఫెల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఈటీఎస్ వంటి పరీక్షలు రాసి ఎంఎస్ చేయవచ్చు.
* ఐసెట్, క్యాట్, మ్యాట్, ఎన్‌మ్యాట్, ఐఐఎఫ్‌టీ వంటి పరీక్షలు రాసి బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ చేయవచ్చు.
* ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేయవచ్చు.
న్యూ కోర్స్
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
ఫుల్ టైం కోర్సుల పరంగా ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతలు తాజాగా ప్రారంభించిన ప్రోగ్రామ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు ప్రధానంగా హెల్త్‌కేర్ రంగంలో ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ పరంగా మరింత రాణించేందుకు దోహదపడుతుంది. ఐఐఎం కోల్‌కత కూడా ఇదే బాటలో ఏడాది వ్యవధి గల హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు.