ఇస్రోలో 375 | 375 in isro | Sakshi
Sakshi News home page

ఇస్రోలో 375

Published Sat, May 7 2016 2:18 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇస్రోలో 375 - Sakshi

సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులు
దేశంలో స్పేస్ సైన్స్ అప్లికేషన్స్, టెక్నాలజీలో విశేష కృషిచేస్తున్న సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)! ఇది తాజాగా వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యువ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం. ఇస్రోలో కొలువును చేజిక్కించుకోవడం ద్వారా ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు!
 
ఉద్యోగం: సైంటిస్ట్/ఇంజనీర్ (ఎస్‌సీ)   
వేతన స్కేలు: రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400).   ఖాళీలు: 375
ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో ‘ఎస్‌సీ’ గ్రేడ్‌లో నియమితులవుతారు. తర్వాత సీనియారిటీ, పని అనుభవం ఆధారంగా ఎస్‌డీ, ఎస్‌ఈ, ఎస్‌ఎఫ్ వంటి గ్రేడ్లు ఇస్తారు.
ప్రారంభంలో గ్రాస్ రూ.45,990 వరకు ఉంటుంది. ట్రావెల్ అలవెన్సు, వైద్య సదుపాయాలు వంటివి కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.isro.gov.in
 
ఇంజనీరింగ్ స్పెషల్ జాబ్ పాయింట్

అర్హత
కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84 సీజీపీఏతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఏఎంఐఈ/గ్రాడ్‌ఐఈటీఈ అర్హత ఉన్న వారికి సెక్షన్ బీలో 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ ఉండాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా అభ్యర్థులు 2016, ఆగస్టు నాటికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
 
వయసు
2016, మే 25 నాటికి 35 ఏళ్లు మించరాదు. పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
 
ఎంపిక ప్రక్రియ
రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో రాత పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
 
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, చలానా జనరేట్ అవుతుంది. ఫీజు మొత్తాన్ని ఎస్‌బీఐలో చెల్లించాలి. చలానా కాపీని ‘సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐసీఆర్‌బీ), ఇస్రో హెడ్‌క్వార్టర్స్, అంతరిక్ష్ భవన్, న్యూ బీఈఎల్ రోడ్, బెంగళూరు’కు పంపించాలి.
 
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 5, 2016
దరఖాస్తుకు చివరి తేదీ: మే 25,2016
రాత పరీక్ష తేదీ: జూలై 3, 2016
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement