
దేశంలో మొదటిసారిగా ‘ప్రెగ్నెన్సీ’ కోర్సు మొదలవబోతోంది. అయితే ప్రెగ్నెంట్ అవడం ఎలా అనే సెక్స్ ఎడ్యుకేషన్ కోర్సు కాదు అది. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిలబస్‌లో ఉంటుంది. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనేవి కూడా ఉంటాయి. లక్నో విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఈ కోర్సు పేరు ‘గర్భ సంస్కారం’. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు ఉపకరించే ఈ కోర్సును మగవాళ్లు కూడా చేయవచ్చా అనే సందేహం అక్కర్లేదు. గర్భిణి జాగ్రత్త గర్భిణిది మాత్రమే కాదు కదా. కోర్సుకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. అబ్బాయిలూ మీరూ దర ఖాస్తు చేసుకోవచ్చు.