Lucknow University
-
దేశంలో మొదటిసారిగా ‘ప్రెగ్నెన్సీ’ కోర్సు
దేశంలో మొదటిసారిగా ‘ప్రెగ్నెన్సీ’ కోర్సు మొదలవబోతోంది. అయితే ప్రెగ్నెంట్ అవడం ఎలా అనే సెక్స్ ఎడ్యుకేషన్ కోర్సు కాదు అది. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిలబస్‌లో ఉంటుంది. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనేవి కూడా ఉంటాయి. లక్నో విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఈ కోర్సు పేరు ‘గర్భ సంస్కారం’. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు ఉపకరించే ఈ కోర్సును మగవాళ్లు కూడా చేయవచ్చా అనే సందేహం అక్కర్లేదు. గర్భిణి జాగ్రత్త గర్భిణిది మాత్రమే కాదు కదా. కోర్సుకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. అబ్బాయిలూ మీరూ దర ఖాస్తు చేసుకోవచ్చు. -
లక్నో వర్సిటీలో గర్భ్ సంస్కార్ కోర్సు..
లక్నో : గర్భం దాల్చినప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భ్ సంస్కార్ పేరిట లక్నో యూనివర్సిటీ దేశంలోనే తొలిసారిగా సర్టిఫికెట్, డిప్లమో కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సులో భాగంగా గర్భిణులు ఎలాంటి దుస్తులు ధరించాలి, వారు తీసుకునే ఆహారం, ప్రవర్తనాశైలి, ఫిట్నెస్ సహా ఎలాంటి సంగీతం వినాలి వంటి పలు పాఠ్యాంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్ధులకు ఉపాథి సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. గర్భ్ సంస్కార్ కోర్సు అభ్యసించేందుకు పురుష విద్యార్థులకూ అవకాశం కల్పిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్ధినులు భవిష్యత్‌లో తల్లులుగా మారే క్రమంలో ఆయా బాధ్యతలను చేపట్టేలా వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలన్న రాష్ట్ర గవర్నర్, వర్సిటీల ఛాన్స్లర్ కూడా అయిన ఆనందిబెన్ పటేల్ సూచనలకు అనుగుణంగా అధికారులు ఈ తరహా కోర్సులకు రూపకల్పన చేశారని లక్నో వర్సిటీ ప్రతినిధి దుర్గేష్ శ్రీవాస్తవ తెలిపారు. గత ఏడాది వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆనందిబెన్ మాట్లాడుతూ మహా భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తీరును వివరించారు. జర్మనీలోని ఓ వర్సిటీలో ఈ తరహా కోర్సు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు. చదవండి : ఓయూ పీజీ హాస్టల్లో విద్యార్థి మృతి -
ఆ 20 మంది అడ్మిషన్లకు లక్నో వర్సిటీ నో..
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గత ఏడాది లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించినప్పుడు నిరసన తెలిపిన విద్యార్ధులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గతంలో సీఎం రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపిన 20 మంది విద్యార్థులకు లక్నో యూనివర్సిటీ అడ్మిషన్లను నిరాకరించింది. వర్సిటీలోని పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నుంచి లక్నో వర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం నేతలు పూజా శుక్లా, గౌరవ్ త్రిపాఠిల నేతృత్వంలో బాధిత విద్యార్థులు నిరాహారదీక్షకు దిగారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వ ఆదేశాల మేరకే వర్సిటీ అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అడ్మిషన్లు ఇచ్చేవరకూ ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరంచారు. గత ఏడాది సీఎం యోగి ఆదిత్యానాథ్ క్యాంపస్‌ను సందర్శించిన సమయంలో నిరసనలకు దిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు బహిష్కరించారు. -
విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి
లక్నో: కాషాయ దళం మరో వివాదానికి తెర లేపింది. ‘విద్యలోనూ కాషాయీకరణ జరుగుతుంది. దేశంలోనూ కాషాయీకరణ జరుగుతుంది. దేశానికి ఏది మంచో.. అది కచ్చితంగా జరుగుతుంది. అది కాషాయీకరణ కావచ్చు, సంఘ్ వాదం కావచ్చు’ అని ఆదివారం కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా అన్నారు. ఛత్రపతి శివాజీ రాజ్యాధికారం చేపట్టి 342 ఏళ్లయిన సందర్భంగా లక్నోవర్సిటీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కఠేరియా మాట్లాడారు. -
గోల్డ్‌మెడల్ కోసం 44 ఏళ్లు ఆగాడు!
లక్నో: అనిల్‌కుమార్ సింగ్ నలభై నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఈ 44 ఏళ్ల కాలంలో ఆయన తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి.. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి.. రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది.. పదవీ విరమణ కూడా చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తన ప్రతిభకు బహుమానంగా దక్కాల్సిన గోల్డ్‌మెడల్‌ను ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో ఆయన చేతికందింది. సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) చలువతో 44 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. 1971లో లక్నో యూనివర్సిటీలో ఇనార్గానిక్ కెమెస్ట్రీలో అనిల్‌కుమార్ సింగ్ అత్యధిక మార్కులు సాధించారు. కెమెస్ట్రీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు యూనివర్సిటీ ప్రతి ఏటా ఎం రామన్ గోల్డ్‌మెడల్ అందజేస్తుంది. అయితే 1971లో ఏవో కారణాలతో స్నాతకోత్సవాన్ని నిర్వహించలేదు. దీంతో ఆ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడళ్లు, బహుమానాలు అందలేదు. అయితే, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన అనిల్‌కుమార్ తనకు జరిగిన అన్యాయంపై పోరాడారు. అనేకసార్లు యూనివర్సిటీ పాలకసిబ్బందికి వినతిపత్రాలు ఇచ్చారు. తన ప్రతిభకు బహుమానంగా గోల్డ్‌మెడల్ ప్రదానం చేయాల్సిందిగా కోరారు. 1971లో ఆయనకు అత్యధిక మార్కులు వచ్చాయన్న విషయాన్ని అంగీకరించిన లక్నో వర్సిటీ మాత్రం.. ఏదైనా సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే.. ఆ ఏడాది ఇవ్వాల్సిన గోల్డ్‌మెడళ్లు తర్వాత ఇవ్వడం కుదరదని మెలిక పెట్టింది. దీనిపై సుదీర్ఘ కాలం పోరాడిన అనిల్‌కుమార్ సింగ్ 2007లో యూనివర్సిటీ నుంచి మార్కుల షీట్‌తోపాటు ఆయనకు గోల్డ్‌మెడల్ అర్హత ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సాధించారు. ఆ తర్వాత ఆర్టీఐ ద్వారా యూనివర్సిటీ చట్టంలోని సెక్షన్ 15.05ను ప్రస్తావిస్తూ మరో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయన దరఖాస్తుకు ఎట్టకేలకు వీసీ ఆమోదం తెలిపడంతో అనిల్‌కుమార్ సింగ్ తన ప్రతిభకు తగిన బహుమానాన్ని అందుకున్నారు. 44 ఏళ్ల నిరీక్షణ అనంతరం శనివారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతులమీదుగా గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. తన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించడం ఆనందం కలిగిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.