![USA Said On Health Of Democracy Under PM Modi - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/6/modi.jpg.webp?itok=XktkkD8y)
భారత్‌లోని ప్రజాస్వామ్యం గురించి అమెరికా అద్భుతంగా ప్రశంసించింది. భారతదేశం ఒక శక్తిమంతమైన ప్రజాస్వామ్యం అని మీరు న్యూఢిల్లీ వెళ్తే అది మీకు కచ్చితంగా కనిపిస్తుందని అమెరికా వైట్‌హౌస్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. మీరే అక్కడకు వెళ్లి స్వయంగా తెలుసుకోగలరని కూడా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా ఆందోళనకర విషయాలు ఉంటే చెప్పడానికి వెనుకాడం, సిగ్గుపడం. ఆఖరికి స్నేహితులైన.. కలిసి పనిచేయాల్సి వచ్చినా.. కూడా కచ్చింతంగా దీని గురించి చెప్పేస్తామని కిర్బీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ..ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, స్నేహం మరింతగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. ఇది ఇలానే ముదుకు సాగాలని ఆశిస్తున్నానని కిర్బీ అన్నారు. అనేక స్థాయిలలో భారత్ అమెరికాకు బలమైన భాగస్వామి అని కిర్బీ అన్నారు. మీరు షాంగ్రిలా సెక్రటరీలో ఆస్టిన్(అమెరికా రక్షణ మంత్రి) భారత్‌తో కొన్ని అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించడం చూశారు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య చాలా భయంకరమైన ఆర్థిక వాణిజ్యం ఉంది.
అదీగాక భారతదేశం ఇప్పుడు ఒక పసిఫిక్ క్యాడ్‌లో సభ్య దేశం. అలాగే ఇండో పసిఫిక్ భద్రతకు సంబంధించిన కీలక స్నేహితుడు, భాగస్వామి అని కిర్బీ పేర్కొన్నారు. అంతేగాదు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగానే కాకుండా, బహుపాక్షికంగా అనేక స్థాయిలలో భారతదేశం కచ్చితం ముఖ్యమైనదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. తాను సమస్యలన్నింటి గురించి మాట్లాడటానికి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే గాక మరింతగా స్నేహన్ని పెంచుకునే ఉద్దేశంతో ప్రధాని మోదీ రాక కోసం తాను ఎదురు చూస్తున్నట్లు కిర్బీ చెప్పుకొచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
(చదవండి: అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్ ఖరారు)
Comments
Please login to add a commentAdd a comment