
విడాకుల వార్తను వినూత్నంగా చెప్పిన మహిళ
న్యూఢిల్లీ: అరచేతిలో గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడన్నది తెలుగిళ్లలో అనాదిగా ఉన్న నమ్మకం. కానీ తన సంసారం చట్టుబండలైన వైనాన్ని ఎర్రగా పండిన గోరింటాకు సాక్షిగా వినూత్నంగా చెప్పిందో మహిళ. తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలను, అనుభవించిన బాధలను మెహందీ ద్వారానే విడమరచి చెప్పింది. ‘విఫల వివాహ విషాద గాథ’ను వివరిస్తూ ఆ మహిళ తన చేతిపై వేసుకున్న మెహందీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సదరు మహిళకు ‘విడాకుల మెహందీ’ వేసిన కళాకారిణి ఊర్వశీ ఓరా ఆ వీడియోను షేర్‌చేశారు. పెళ్లయ్యాక అత్తగారింట అడుగుపెట్టింది మొదలు ఇంట్లో బట్టలుతకడం, అత్తగారి దృష్టిలో పనిమనిషిలా పనులన్నీ చేయడం, భర్త నుంచి దేనికీ మద్దతు లేక దిగాలు పడటం, తరచూ మనస్పర్ధలు, గొడవలు, ఒంటరితనం... ఇలా చివరకు విడాకుల దాకా తన వ్యథను మెహందీ ద్వారా వ్యక్తీకరించారు. ప్రేమ, ఆనందమయ క్షణాల్లో సంబరాలకు ప్రతీకగా నిలిచే మెహందీ ద్వారా ఇలా అంతులేని బాధను వ్యక్తం చేయొచ్చని నిరూపించారు.
Divorce Mehndi Design: महिला ने मेहंदी डिजाइन से बतायी शादी से लेकर तलाक तक की कहानी, pic.twitter.com/ZuYdTlT9Bl
— Vikash Kashyap (@VikashK41710193) December 14, 2024
Comments
Please login to add a commentAdd a comment