న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు.
'రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానం థాయిలాండ్'
“కాంగ్రెస్ మేనిఫెస్టోలో నీటి నిర్వహణపై ఓ చిత్రం ఉంది. ఈ చిత్రం న్యూయార్క్‌లోని బఫెలో నదికి సంబంధించినది. తమ సోషల్ మీడియా ఛైర్‌పర్సన్ ట్విటర్ నుండి ఎవరు ట్వీట్ చేస్తున్నారో వారు ఇప్పటి వరకు దీన్ని గుర్తించలేకపోయారు. కానీ వారికి ఈ చిత్రాన్ని ఎవరు పంపారు? పర్యావరణ విభాగం కింద, రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానమైన థాయ్‌లాండ్ నుండి ఒక చిత్రాన్ని పెట్టారు. వీటన్నింటినీ తమ మేనిఫెస్టోలో ఎవరు పెడుతున్నారు?’’ అని సుధాన్షు త్రివేది అన్నారు.
'విదేశీ ఫొటోలను అరువు తెచ్చుకుంటున్నారు'
“తప్పు ఫోటోలు ఉపయోగించడం పెద్ద సమస్య కాదు. అయితే ఈ ఫోటోలు విదేశీ సంస్థలకు సంబంధించినవి. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి భారత్, ప్రధాని నరేంద్ర మోదీ పరువు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వారు తమ మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలను అరువు తెచ్చుకుంటున్నారు" అని విమర్శించారు.
Looks like the Congress forgot that it is preparing a manifesto for India and not putting together a holiday itinerary for Rahul Gandhi!
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 5, 2024
What else explains using picture of Thailand under the Environment section?
It shouldn’t be a surprise if Rahul Gandhi dashes off to Thailand,… pic.twitter.com/5MsNTCjFuc
'రాహుల్ గాంధీ హాలిడే టూర్‌లా ఉంది'
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ మరో నేత అమిత్ మాల్వియా విరుచుకుపడ్డారు. "భారతదేశం కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని, రాహుల్ గాంధీ కోసం హాలిడే టూర్ షెడ్యూల్‌ను రూపొందించడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది" అన్నారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ మరో హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని మాల్వియా ‘ఎక్స్’ పోస్ట్‌లో రాశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. మేనిఫెస్టోను రూపొందించడానికి విదేశీ ఏజెన్సీని నియమించారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment