ఇటీవల కంటి నుంచి పురుగులు పడటం, పొట్టలో పురుగులును గుర్తించి తీయడం విన్నాం. అంతవరకు బాగానే ఉంది. కలుషిత ఆహారం లేదా శుభ్రత పాటించకపోవడం వచ్చిందని అన్నారు వైద్యులు. కొందరూ కొన్ని రకాల జంతువులను తినడం వల్ల కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడొక మహిళ ముక్కులో ఒకటి రెండు కాదు ఏకంగా వందలకొద్ది పురుగులు బయటపడ్డాయి. వైద్యులు సైతం విస్తుపోయారు. ఈ భయానక ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..థాయిలాండ్‌కి చెందిని 59 ఏళ్ల మహిళ ముక్కు మూసుకుపోయి విపరీతమైన బాధని అనుభవించింది. ఒక వారం రోజుల నుంచి ముక్కు నుంచి రక్త కారడంతో భయపడి థాయిలాండ్‌లోని చియాంగ్ మాయిలోని నాకోర్న్‌సింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దుమ్ముకు సంబంధించిన ఎలర్జీగా భావించి సైనసైటిస్‌కు చికిత్స ఇవ్వడం జరిగింది. అక్కడ నివాసితలు అలెర్జీలు, రినిటిస్ వంటి శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఆ సమస్యగానే భావించి చికిత్స అందించారు.
అందులో భాగంగానే ముక్కుకి స్కానింగ్ చేయగా..వందలకొద్ది పురుగులు కనిపించాయి. ఒక్కసారిగా వైద్యులు సైతం కంగుతిన్నారు. వెంటనే సదరు మహిళకు ఎండోస్కోపి ద్వారా ఆ పురుగులన్నింటిని తీసేశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఒక వేళ వీటిని సకాలంలో గుర్తించి తొలగించనట్లయితే మెదడు వరకు ఈ పురుగులు వలసపోయి తీవ్రమైన సమస్యలు తలెత్తి మరణానికి దారితీస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య సరైన శుభ్రత పాటింకపోవడం వల్లే వస్తుందని అన్నారు
ఆమె రెండు నాసికా కుహరాల్లో వందలకొద్ది పురుగులు ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఎక్స్‌రే తీసినప్పుడూ ఆమె ఎడమ జెగోమాటిక్ సైనస్‌లో తెల్లటి మచ్చ ఉండటంతోనే పురుగులు ఉన్నాయన్న అనుమానం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి అరుదైన కేసు 2022లో పోర్చుగల్‌లో నమోదయ్యింది. అక్కడ ఒక వృద్ధుడి చెవిలో మాంసంతినే పురుగులును గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు.
Comments
Please login to add a commentAdd a comment