స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు రాంచీలో మొదలవుతుంది. తొలి రోజు థాయ్‌లాండ్ జట్టుతో సవితా పూనియా కెపె్టన్సీలోని భారత జట్టు ఆడనుంది. మ్యాచ్ రాత్రి గం. 8:30 నుంచి జరుగుతుంది.
చైనా, జపాన్, కొరియా, మలేసియా జట్లు కూడా ఈ టోరీ్నలో పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత్ 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్ 2న కొరియాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు నవంబర్ 4న సెమీఫైనల్లో తలపడతాయి. నవంబర్ 5న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్–5 చానెల్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment