హన్మకొండ : థాయిలాండ్ దేశంలో సహకార రంగంలోనే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ కొనసాగుతోందని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్‌రావు అన్నారు. సహకార రంగంలో స్థిరమైన ఫైనాన్సింగ్ వ్యూహాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అంశంపై థాయిలాండ్‌కు స్టడీ టూర్‌కు వెళ్లి వచ్చిన మార్నేని సోమవారం ‘సాక్షి’తో అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మన దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ ప్రత్యేక వ్యవస్థగా కొనసాగుతుంటే థాయిలాండ్‌లో సహకార రంగంలోనే కొనసాగుతుంది. మన దేశంలో చిన్నచిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తుంటే థాయిలాండ్‌లో కమతాలు చాలా విశాలంగా ఉంటాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం 30 నుంచి 50 ఎకరాల వరకు ఉంటుంది. కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ దేశంలో పంట ఉత్పత్తులకు విలువ జోడింపు చేస్తారు. దీంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది.
వరితోపాటు పండ్లు, కూరగాయలు
వరితో పాటు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేస్తారు. పండ్లు, కూరగాయల సాగు పాలీ హౌజ్‌ల్లోనే చేస్తారు. పంట ఉత్పత్తులను రైతులే ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. ప్రతి వ్యవసాయ క్షేత్రం కంపెనీని తలపిస్తుంది. భారత్‌లో 80 శాతం ఆధారపడితే థాయిలాండ్‌లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతారు. అక్కడ సాగునీటి వనరులు తక్కువ. మార్కెటింగ్ మన దగ్గర అంత సానుకూలంగా ఉండదు. అదే థాయిలాండ్‌లో సులువుగా ఉంటుంది. థాయిలాండ్ ప్రధానంగా పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచింది. మన దేశంలోనే కేంద్ర సహకారం పెరిగితే సహకార రంగం పురోభివృద్ధి సాధిస్తుంది.
అధ్యయనానికి వస్తామన్నారు..
తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా గురించి చెప్పితే ఇలా కూడా ఉంటుందా అని థాయిలాండ్ దేశస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విష యం విన్న వారు తెలంగాణకు వచ్చి అధ్యయ నం చేస్తామని చెప్పారు. సహకార వ్యవస్థలో నూ తన విధానాలు తీసుకురావడానికి ఈ స్టడీ టూర్ కు వెళ్లాం. 22వ తేదీన బ్యాంకాక్‌లోని హోటల్ సెంట్రో వాటర్‌గేట్‌లో సమావేశమై వివిధ సహకార సంఘాల పనితీరు.. వ్యవస్థ విధి విధానాల పై చర్చించాం. రెండో రోజు బ్యాంకాక్‌లోని సహకార శాఖ కార్యాలయాలు, వాటి పనితీరును అఽ ద్యయనం చేశాం. మూడోరోజు బోతాంగ్ జిల్లా థాట్‌తంగ్‌లో గల పంటలను పరిశీలించాం.
Comments
Please login to add a commentAdd a comment