తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తె | Daughter Compleats Father Funeral Programme in GVMC | Sakshi
Sakshi News home page

తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తె

Published Thu, Jun 6 2019 10:05 AM | Last Updated on Mon, Jun 10 2019 11:58 AM

Daughter Compleats Father Funeral Programme in GVMC - Sakshi

తండ్రి శవయాత్రలో పాల్గొన్న కుమార్తె శ్రావణి (ఇన్‌సెట్‌) సూర్యనారాయణ(ఫైల్‌)

విశాఖపట్నం ,మల్కాపురం(విశాఖ పశ్చిమ): న్మనిచ్చిన తండ్రికి సేవ చేసింది... ఆ తండ్రి మరణించడంతో తలకొరివి పెట్టి రుణాన్ని తీర్చుకుంది ఓ మహిళ. జీవీఎంసీ 47వ వార్డు హిమచల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పి.వి.వి.సూర్యనారాయణ(50), అతని భార్య సత్యకు ముగ్గురు కుమార్తెలు. సూర్యనారాయణ హోమ్‌గార్డుగా విధులు నిర్వాహిస్తున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్య తలెత్తింది. తండ్రికి తలెత్తిన అనారోగ్య సమస్యపై చలించిన పెద్దకుమార్తె శ్రావణి ఆయనకు సేవలు చేసేది. శ్రావణి మాదిరిగానే మిగిలిన ఇద్దరు కుమార్తెలు తండ్రికి ఏ కష్టమోచ్చినా అండగా నిలిచేవారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యతో సూర్యనారాయణ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో పెద్ద కుమార్తె శ్రావణి ముందుకొచ్చి తండ్రి శవయాత్రలో పాల్గొని తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement