తండ్రికి తలకొరివి పెడుతున్న కుమార్తె భాగ్యం
విజయనగరం, జలుమూరు: సాధారణంగా ఎవరైనా మృతి చెందితే అతనికి దహన సంస్కారాలు పురుషులు చేస్తారు. మృతి చెందిన వ్యక్తి తండ్రి అయితే ఇంటి పెద్ద కొడుకు, తల్లి అయితే చిన్న కొడుకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందు తలకొరివి(ముఖాగ్ని) పెట్టడం సంప్రదాయం. కాని జలుమూరు మండలంలో చెన్నయవలసలో కావాటి పొట్టయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందగా అతని కుమార్తె బండి భాగ్యం తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది. పొట్టయ్య భార్య రమణమ్మ చాలాఏళ్ల క్రితం శనిపోయింది. వీళ్లకు కుమారులు లేరు, కుమార్తె ఉంది. పొట్టయ్య మరో వివాహం చేసుకోకుండా కుమార్తె భాగ్యంను కొడుకులా పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. తాను మృతి చెందితే అల్లుడుతో కాకుండా నీవే నాకు తలకొరివి పెట్టాలని తరచూ చెప్పేవాడు. తన తండ్రి కోరికపై తాను ఇలా తలకొరివి పెట్టినట్లు భాగ్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment