పట్నా: ఏమాత్రం అజాగ్రత్తపడ్డా మనుషుల్ని పీడించేందుకు కరోనా రక్కసి సిద్ధంగా ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కరోనాకు మరింత చేరువ చేస్తుందనడానికి ఇక్కడ జరిగిన సంఘటనే నిదర్శనం. అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్ వచ్చిన ఘటన బిహార్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో వ్యాపారవేత్త రాజ్ కుమార్ గుప్తా జూలై 10న అనారోగ్యంతో మరణించాడు. అయితే అంత్యక్రియల్లో పాల్గొన్న అతని మేనల్లుడితో పాటు కుటుంబంలో మరొకరికి కరోనా సోకినట్లు తేలింది. (నితీష్ కుమార్‌కు కరోనా పరీక్షలు)
దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న 37 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. బిహ్త ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బంధించి శానిటైజ్ చేస్తున్నారు. కాగా బిహార్‌లో 16642 కేసులు నమోదవగా 5001 యాక్టివ్ కేసులున్నాయి. 143 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. (పాడె మోసేందుకూ ముందుకు రాలేదు)
Comments
Please login to add a commentAdd a comment