పాడె కట్టాడు... అంతలోనే... | The Sudden Death Of A Burning Person During Funeral | Sakshi
Sakshi News home page

పాడె కట్టాడు... అంతలోనే...

Published Mon, Mar 4 2019 8:00 AM | Last Updated on Mon, Mar 4 2019 8:00 AM

The Sudden Death Of A Burning Person During Funeral - Sakshi

క్రిష్ణయ్య (ఫైల్‌)

సాక్షి, మునుగోడు : మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాల నిమిత్తం పాడె కట్టిన మరో వ్యక్తి వెంటనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని చీకటిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సిరగమళ్ల క్రిష్ణయ్య (50) అనే వ్యక్తి వృత్తి రీత్యా మరణించిన వారికి దహన సంస్కరణ ఏర్పాట్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆయన దహన సంస్కారాలకు అవసరమైన పాడెను కట్టి శవయాత్ర వెంట వెళ్తున్నాడు. అయితే అంతలోనే అతడికి గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement