Burning man
-
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు హాజరై చిక్కుకుపోయిన 70వేల మంది
బర్నింగ్‌మ్యాన్ ఫెస్టివల్.. ఇది అమెరికాలోని ఎడారిలో నిర్వహించే అతిపెద్ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ నిర్వహించే క్రమంలో 70 వేల మంది ఎడారిలో చిక్కుకుపోయారు. ఎడారిలో అతి భారీ వర్షం కురవడంతో వేల సంఖ్యలో ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు.. వర్షం కారణంగా ఎడారి అంతా బురద మయంగా మారడంతో ఎవరూ కూడా అక్కడ నుంచి బయటపడలేని పరిస్థితులు తలెత్తాయి. నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారి వర్షం కారణంగా పూర్తిగా చిత్తడిగా మారిపోయి అంతా బురద మయం అయిపోయింది. దాంతో ఆ ఫెస్టివల్‌కు హాజరైన సుమారు 70వేలకు పైగా ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. కొన్ని మైళ్ల దూరం వరకూ ఎటువైపు చూసినా బురదే కనిపిస్తోంది. నడుస్తుంటే కాళ్లు బురదలో కూరుపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ వాహనాలకు అనుమతి నిరాకరించడంతో సందర్శకులు అక్కడే ఆహారం, నీరు సమర్చుకుని పొడిగా ఉన్న ప్రదేశంలో తలదాచుకోవాలని అధికారులు తెలిపారు. గత నెల 27వ తేదీన బర్నింగ్ మ్యాన్ ఫెప్టివల్ మొదలు కాగా, ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హరికేన్ తాకింది. దాంతో భారీ వర్షం కురిసి ఆ ప్రాంతం బురద మయంగా మారిపోయింది. ఒక్కరాత్రిలోనే నెలలకు పైగా కురవాల్సిన వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా స్తంభించిపోయింది. కొంతమంది బురదలోనే అక్కడ నుంచి బయటపడేందకు యత్సిస్తున్నా పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. -
పాడె కట్టాడు... అంతలోనే...
సాక్షి, మునుగోడు : మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాల నిమిత్తం పాడె కట్టిన మరో వ్యక్తి వెంటనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని చీకటిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సిరగమళ్ల క్రిష్ణయ్య (50) అనే వ్యక్తి వృత్తి రీత్యా మరణించిన వారికి దహన సంస్కరణ ఏర్పాట్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆయన దహన సంస్కారాలకు అవసరమైన పాడెను కట్టి శవయాత్ర వెంట వెళ్తున్నాడు. అయితే అంతలోనే అతడికి గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. -
విమానాన్ని పేల్చబోయి కింద పడ్డాడు!
సోమాలియా: అది సోమాలియా నుంచి జిబౌతికి బయలుదేరిన డాలో ఎయిర్ లైన్స్‌కు చెందిన డీ3159 విమానం. సోమాలియా విమానాశ్రయం నుంచి జిబౌతికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి విమానం ఎగిరి ఐదు నిమిషాలు గడిచిందో లేదో సరిగ్గా ఇంజిన్ రెక్కభాగం వైపుగా ఉన్న డోర్ వద్ద డామ్మని పేలుడు. విమానంలోని ప్రయాణికులు చూస్తుండగా కాలుతూ ఉన్న ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు దాదాపు 14 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ విమానం నియంత్రణ కోల్పోలేదు. చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ విమానాన్ని వెనక్కితిప్పి సురక్షితంగా తిరిగి సోమాలియా విమానాశ్రయంలో దించివేశాడు. దీంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమాలియా సాధారణంగానే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ షహాబ్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు సంభవించిన సందర్భంగా అధికారులు, అందులోని ప్రయాణీకులు పలు రకాల అంశాలు తెలిపారు. విమాన పైలెట్ వ్లాదిమిర్ వోడోపివెక్(64) ఈ సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ 'నేను అనుకుంటున్నాను అది ఒక బాంబు. అదృష్టవశాత్తు విమానం నియంత్రణ కోల్పోలేదు. అందుకే, నేను తిరిగి మొగాదిషు విమానాశ్రయంలో ఫ్లైట్ దించివేశాను. నా జీవితం మొత్తంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు' అని అన్నారు. ఇక ఇదే విమానంలో ప్రయాణించిన సోమాలియా అంబాసిడర్ అవాలే కుల్లానే ఫేస్ బుక్ లో ఈ ఘటన వివరిస్తూ 'విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. కానీ అక్కడ ఏం కనిపించలేదు.. కొద్ది సెకన్లపాటు దట్టంగా పొగమాత్రం వచ్చింది' అని చెప్పారు. ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని చెబుతూ 'నాకు తెలియదు అది బాంబో లేక విద్యుత్ షాకో.. కానీ విమానంలో పెద్ద శబ్దం మాత్రం వినిపించింది. అయితే, ఓ వ్యక్తి విమానం నుంచి పడిపోయాడా లేదా అని మాత్రం నాకు తెలియదు' అని చెప్పాడు. కాగా మహ్మద్ హుస్సేన్ అనే పోలీసు అధికారి మాట్లాడుతూ బలాద్ పట్టణంలో విమానం పై నుంచి పడిన ఓ పెద్దాయనను గుర్తించారు అని చెప్పాడు. అయితే, విమానం నుంచి పడిపోయిన వ్యక్తి ఉగ్రవాదా, లేక విమానంలో ఏదైన పేలుడు పదార్థం పేలి కారణంగా పడిపోయాడా, లేదా ఆత్మాహుతి దాడికి దిగి ఆ మంటలు అంటుకున్న కారణంగా తట్టుకోలేక కిటికీలో నుంచి దూకేశాడా అనేది దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది.